Pawan Kalyan: హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్..!
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు గతంలో బౌన్సర్ గా పనిచేసిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. సదరు వ్యక్తి ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు బౌన్సర్ గా చేస్తున్నారా లేదా తెలియరాలేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన కోటేశ్వర రావు బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. మంచి ఫిజిక్ ఉండడంతో బౌన్సర్ గా మారాడు. అతను పవన్ కల్యాణ్ తో పాటు పలువురు సినీ అర్టిస్టులకు బౌన్సర్ గా పని చేశారు. అంతేకాదు పోలీసుల వద్ద ప్రైవేట్ డ్రైవర్ గా చేశారు.
కోటేశ్వర రావు 15 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంత ఊరు బుర్రిపాలెం వెళ్లాడు. అతను మంగళవారం సొంత ఊరిలో హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కోటేశ్వర రావును ప్లాన్ ప్రకారం హత్య చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అతన్ని తాగిన మత్తులో చంపేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కోటేశ్వర రావు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోటేశ్వర రావు హైదరాబాద్ నుంచి బుర్రిపాలెం ఎందుకు వెళ్లాడు. అతన్ని ఎవరు చంపారు. అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోటేశ్వర రావు కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఈ హత్యకు ప్రేమ వ్యవహారం ఏమైనా కారణమై ఉండోచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications