ఏపీకి మరో తుఫాన్ ముప్పు - ఈ జిల్లాలపై అధిక ప్రభావం, తాజా అలర్ట్స్..!!

ఏపీకి తుపాన్‌ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా అతాలకుతాలమైన ఏపీలో మరో సారి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని అంచనాగా వెల్లడించారు. దీంతో, కోస్తా జిల్లాల పైన ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఏపీకి మరోసారి తుఫాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు(గురువారం) ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, రేపు(శుక్రవారం) కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్ హణ సంస్థ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, మంగళవారం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

a-potential-cyclone-threat-is-hovering-over-ap-according-imd-predictions

కాగా, రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంత ప్రజలు గజగజలాడిపోతున్నారు. మంగళవారం రాత్రి అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్పం. అదే జిల్లాలోని ముంచంగిపుట్టులో 5.8, చింతపల్లిలో 6.8, డుంబ్రిగుడలో 7.8, పాడేరు, పెదబయలులో 8.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపే నమోదయ్యాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం తెలంగాణలో చలిగాలులు వీయొచ్చని ఐఎండీ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+