గాల్లో విమానం ఉంటే డోర్ తియ్యడానికి ప్రయత్నించిన రాజమండ్రి యువకుడు !
బెంగళూరు/రాజమండ్రి: ప్యారిస్ నుంచి బెంగుళూరు వస్తున్న విమానం మధ్యలో డోర్ తియ్యడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలతో ఓ యువకుడిని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన వెంకట్ మోహిత్ (29) అనే యువకుడు అరెస్టు అయ్యాడని పోలీసు అధికారులు తెలిపారు.
నిందితుడు వెంకట్ మోహిత్ జూన్ 15న ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ప్యారిస్ నుంచి బెంగళూరు వచ్చాడు. విమానం బెంగళూరు చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటల దూరంలో ఉండగా అతను అకస్మాత్తుగా విమానం వెనుక ఎడమ వైపు ఉన్న తలుపు తెరవడానికి ప్రయత్నించాడని విమానం సిబ్బంది సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు

విమానాల్లో ప్రయాణిస్తున్న కొంత మంది ఇటీవల కాలంలో వింతవింతగా ప్రవర్తించడం విమాన సిబ్బందితో పాటు సంబంధిత అధికారులకు పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. విమానం గాలిలో ఉన్న సమయంలో ఇలా డోర్ తెరవడానికి ప్రయత్నించడం. లేదా సాటి ప్రయాణికులతో, విమాన సంస్థల సిబ్బందితో అనుచితంగా ప్రవర్తంచడం లాంటి సంఘటనలు ఇటీవల కాలంలో చాలా వెలుగు చూశాయి.












Click it and Unblock the Notifications