కడప జిల్లాలో వింత ఆచారం.. పెళ్లిలో వరుడుతో ఆ పని !
మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే "వివాహం". కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవుతాయి. అందుకే పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి అయినా కానీ మంచి సంబంధం ఫిక్స్ చేసుకోవాలని అంటారు. అందుకే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమని అంటుంటారు. అందుకే పెళ్లి వేడుకను ఘనంగా భారీ స్థాయిలో ఎవరి పద్ధతుల్లో వారు నిర్వహిస్తారు.
కాగా భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు ఉన్నాయి. పలు మతాలు, పలు మతాలకు చెందిన వారంతా కలిసి నివసిస్తూ భిన్నత్వంలో ఏకత్వం అని నిరూపిస్తూ ఉంటారు. అయితే పెళ్లి విషయంలో ఎవరి పద్ధతులు వారికి ఉన్నాయి. వివాహ వేడుకలో వారి వారి సంప్రదాయాలను అనుసరిస్తూ సరదా కార్యక్రమాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఏపీలోని కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో మాత్రం ఓ విచిత్రమైన ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఏం చేస్తారంటే..?
వైఎస్ఆర్ కడప జిల్లాలోని భద్రంపల్లె, లోమడ, బూచుపల్లె, బోడివారిపల్లె, మల్లేల, తొండూరు, ఇనగలూరు, సంతకొవ్వూరు, అగడూరు గ్రామాల్లో.. 'బూచుపల్లె' వంశీయులు నివసిస్తున్నారు. సుమారు 1000కి పైగా కుటుంబాలు ఉన్నాయి. వారి పెళ్లిళ్లలో ఒక నియమాన్ని తప్పనిసరిగా పాటిస్తూ వస్తున్నారు. పెళ్లి పీటలపై వధువు మెడలో వరుడు తాళి కట్టిన వెంటనే.. అతడికి బంధువులు కొరడాతో మూడు దెబ్బలు కొడతారు. ఈ వింత ఆచారం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది.
వందల సంవత్సరాల క్రితం.. బూచుపల్లె పూర్వీకులు గంగమ్మ ఆలయం నుంచి పొరపాటున ఓ పెట్టెను ఇంటికి తీసుకొచ్చారట. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఐదు కొరడాలు కనిపించాయని.. అందుకు గాను తమ తప్పు తెలుసుకొని గంగమ్మ తల్లిని క్షమించమని వేడుకున్నారట.
దాంతో అమ్మవారు ప్రత్యక్షమై వారి వంశంలో జరిగే ప్రతి పెళ్లిలో వరుడికి మూడు కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశించినట్టు చెబుతారు. ఇక ఆనాటి నుంచి గంగమ్మ ఆదేశాన్ని పాటిస్తూ.. నేటికీ తమ పెళ్లిళ్లలో ఈ కొరడా దెబ్బల సంప్రదాయాన్ని పాటిస్తున్నామని అంటున్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications