Viral Video: బీర్ల లోడ్‍తో వెళ్తోన్న వ్యాన్ బోల్తా.. ఎగబడ్డ జనాలు.. వీడియో వైరల్..

చేపలతో వెళ్తున్న లారీ బోల్తా పడితే ఏం చేస్తాం.. అందులో ఉన్న చేపలు తీసుకెళ్తాం. పెట్రోల్ ట్యాంక్ బోల్తా పడితే భయం లేకుండా పెట్రోలు తీసుకెళ్తాం. చాలా మంది ప్రమాదంతో సంబంధం లేకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్తుంటారు. తాజాగా ఓ బీర్ల లోడ్ తో వెళ్తున్న వ్యాను బోల్తా పడడంతో అందులో ఉన్న బీర్లను స్థానికులు పట్టుకెళ్లారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది.

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై బీరు సీసాలతో వెళ్తున్న వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 కేసుల బీరు సీసాలు నేలపాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం వ్యాను ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్‌ గోడౌన్‌ అనకాపల్లి నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వ్యాన్ బోల్తా పడగానే కొన్ని కేసులు బీర్లు పగిలిపోయాయి.

A video of a beer van carrying a load of beer overturned in Anakapalli district has gone viral on social media.

బాగా ఉన్న బీరు కేసులను తీసుకెళ్లేందుకు స్థానికులు తలలొచ్చారు. చాలా మంది చేతికందిన బీర్లను తీసుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో బీరు బాటిళ్ల లారీ బోల్తా కొట్టింది. దీంతో బీరు బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. బీరు బాటిళ్లు కోసం జనం ఎగబడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+