చంద్రబాబు కస్డడీ వేళ కోర్టు కండీషన్స్ - బెయిల్ పైనా క్లారిటీ..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబును సీఐడీ(CID) రెండు రోజుల విచారించనుంది. సీఐడీ అయిదు రోజుల విచారణకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరింది. దీని పైన విచారణ చేసిన న్యాయస్థానం..రెండు రోజులు రిమాండ్ పొడిగించటంతో..ఆ రెండు రోజులు సీఐడీ కస్టడీకి ఇస్తూ తీర్పు వెలువరించింది. అదే సమయంలో చంద్రబాబు(Chandra Babu) విచారణ వేళ కొన్ని నిబంధనలను స్పష్టం చేసింది. చంద్రబాబు బెయిల్ పై సోమవారం విచారణ జరగనుంది.
చంద్రబాబును సీఐడీ రేపటి నుంచి రెండు రోజుల పాటు విచారణ చేయనుంది. ఇందుకు అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు(ACB Court) పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆది, సోమ వారాల్లో రాజమండ్రి జైలులోనే చంద్రబాబును విచారిస్తామని సీఐడీ చెప్పటంతో కోర్టు అందుకు అనుమతించింది. చంద్రబాబు లాయర్లు ఒకరు లేదా ఇద్దరి సమక్షంలో విచారణ చేయాలని సూచించిన న్యాయస్థానం...విచారణ చేసే అధికారుల పేర్లను సీఐడీ నుంచి సేకరించింది. ఈ రెండు రోజులు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ చేయాలని నిర్దేశించింది.

నివేదిక సిల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించిన న్యాయస్థానం..విచారణ సమయంలో వీడియో, ఫోటోలు బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. దీంతో, చంద్రబాబు(Chandra Babu) తరపు న్యాయవాదులు 12 పేర్లతో విచారణ సమయంలో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అదే సమయంలో విచారణ చేసే అధికారుల జాబితాను సీఐడీ కోర్టుకు అందచేసింది. చంద్రబాబును విచారించే సమయంలో ప్రతీ గంట తరువాత అయిదు నిమిషాల చొప్పున విరామం ఇవ్వాలని కోర్టు సూచించింది. అంతకు ముందు చంద్రబాబును వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా విచారణ చేసిన న్యాయమూర్తి జైలులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎటువంటి ఇబ్బంది ఉన్న తనకు చెప్పాలని సూచించారు.
ఇక, హైకోర్టులో క్వాష్ పిటీషన్ డిస్మస్ అయిన తరువాత సీఐడీ కస్టడీ(CID Custody)కి న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. వచ్చే సోమవారంతో చంద్రబాబు సీఐడీ కస్టడీతో పాటుగా రిమాండ్ సమయం ముగించనుంది.క్వాష్ పిటీషన్ హైకోర్టులో డిస్మిస్ కావటంతో చంద్రబాబు తరుపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉన్న బెయిల్ పిటీషన్ విచారణ చేయాలని కోరారు. అయితే, సీఐడీ కస్టడీకి ఇచ్చిన సమయంలో విచారణ సరి కాదని పేర్కొన్న న్యాయస్థానం..సోమవారం విచారించేందుకు అంగీకరించింది. దీంతో, సోమవారం చంద్రబాబు బెయిల్(Chandra Babu Bail).. రిమాండ్ పొడిగింపు పైనా స్పష్టత రానుంది. ఇదే సమయంలో హైకోర్టు డిస్మిస్ చేసిన క్వాష్ పిటీషన్ విషయంలో చంద్రబాబు న్యాయవాదులు ఏం చేస్తారనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications