ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ - కండీషన్స్ అప్లై..!!
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ దక్కింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మిథున్ పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారణ చేసిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిరిగి ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు సరెండర్ కావాలని కోర్టు షరతు విధించింది. ఈ సాయంత్రం మిథున్ జైలు నుంచి బయటకు రానున్నారు.
లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్న మిథున్ కు ఈ నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు బెయిల్ ఇవ్వాలని కోరగా అందుకు అనుమతి లభించింది. కాగా, ఇదే సమయంలో బెయిల్ వేళ రూ 50 వేల పూచీ కత్తు.. ఇద్దరు షూరిటీతో పాటుగా పలు షరతులను కోర్టు విధించింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ఏ-4గా ఉన్నారు. సిట్ విచారణ ఎదుర్కొన్న మిథున్ ను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. కాగా, మిథున్ మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో గత బుధవారం వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్ వాదిస్తూ,ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే అమృతపాల్ సింగ్ కేసులో పోస్టల్ బ్యాలట్ వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఇదే విధానాన్ని మిథున్‌రెడ్డికి కూడా వర్తింపజేయాఅని పేర్కొన్నారు.

మధ్యంతర బెయిల్‌పై వాదనలు ముగియడంతో తీర్పును ఆరో తేదీన వెలువరిస్తామని న్యాయాధికారి పి.భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు ఈ రోజు తీర్పు వెలువరించారు. 9వ తేదీన జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మిథున్ తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి వైసీపీ మద్దతు ప్రకటించింది. ఓటు వేసిన తరువాత 11న తిరిగి మథున్ సరెండర్ కావాలని కోర్టు నిర్దేశించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications