ఏసీబీకి చిక్కిన మరో తిమింగలం: కోట్లాది రూపాయల ఆస్తులు గుర్తింపు
అవినీతి నిరోధక శాఖ వలకు అనంతపురం జిల్లాలో మరో తిమింగలం చిక్కింది. పెనుగొండ ఐసీడీఎస్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న నారాయణ రెడ్డి ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించింది.
అనంతపురం: అవినీతి నిరోధక శాఖ వలకు అనంతపురం జిల్లాలో మరో తిమింగలం చిక్కింది. పెనుగొండ ఐసీడీఎస్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న నారాయణ రెడ్డి ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించింది.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఏసీబీ అనంతపురంలొని కొవ్వూరు నగర్‌లోని నారాయణ రెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించారు.

పెనుగొండ, ధర్మవరం, నడిమిదొడ్డి గ్రామాల్లోను ఏకకాలంలో సోదాలు చేశారు. రూ.50 కోట్ల విలువైన డాక్యుమెంట్లు గుర్తించారు. 10కి పైగా ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఐసీడీఎస్‌లో చిన్నపిల్లలకు, గర్భిణీలకు అందించాల్సిన కోడిగుడ్లు, పౌష్టికాహారం టెండర్లలో భారీగా అవినీతికి పాల్పడినట్లు నారాయణరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications