అలీకి హ్యాండిచ్చిన సీఎం జగన్

నటుడు అలీ గత ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లోనే వైసీపీలో చేరిన అలీ..పార్టీ అభ్యర్థుల తరుఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవితో అలీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయడం ఖాయంగా అనుకున్నారంతా.

నంద్యాల, గుంటూరు పార్లమెంట్ స్థానాలకు అలీ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అలీకి వచ్చే ఎన్నికల్లో ఎక్కడా కూడా సీటు దక్కని పరిస్థితి. దీంతో అలీని జగన్ రాజ్యసభకు పంపిస్తారని అంతా భావించారు కానీ ఆ ఆశలపై కూడా సీఎం జగన్ నీళ్లు చల్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరులో సీఎం జగన్ మాట్లాడుతూ.. కర్నూల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ పాషా కొన్ని కారణాల వల్ల సీటు కేటాయించలేకపోయానని...రెండేళ్ల తర్వాత హఫీజ్‌ పాషాను రాజ్యసభకు పంపుతానని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

Actor Ali is deeply disappointed in YCP

మైనారిటీ కోటా విషయంలో జగన్‌ హఫీజ్‌ పాషాకు హామీ ఇవ్వడంతో ఇప్పుడు అలీ పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎమ్మెల్సీ ఒకటి మినిహా అలీకి వైసీపీలో అన్ని డోర్లు క్లోజ్ అయ్యాయి. ఈక్రమంలో అలీ వైసీపీలో ఉంటారా లేదా అనే అనుమానాలు తెర మీదకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అలీ ప్రచారానికి దూరంగా ఉంటారనే వార్తలు కూడా వెలువడ్డాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే అలీ మాత్రం వైసీపీకి అండగా నిలిచారు.

వైసీపీకి మద్దతు తెలిపిన కొద్ది మంది ఇండస్ట్రీవాళ్లలో అలీ మొదటి వరుసలో ఉంటారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. దీంతో అలీకి మంచి పదవి దక్కుతుందని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు మైనారిటీ కోటా రాజ్యసభ సీటు అభ్యర్థి ఖరారు చేయడంతో అలీ రాజకీయ జీవితంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. మరి అలీకి జగన్‌ ఎలా న్యాయం చేస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+