భూమా మౌనికపై మోహన్ బాబు దాడి?: మనోజ్ కంప్లైట్: మంచు కుటుంబంలో విభేదాలు భగ్గు

Mohan Babu: ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి తగాదాలు తెర మీదికి వచ్చాయి. విభేదాలు భగ్గుమన్నాయి. పరస్పరం భౌతికంగా దాడులు చేసుకునేంత వరకూ వెళ్లాయి. చివరికి- పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకునేంత పరిస్థితి తలెత్తింది.

తన భార్య భూమా మౌనిక రెడ్డిపై తండ్రి మోహన్ బాబు దాడి చేశారంటూ ఆయన కుమారుడు, నటుడు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తననూ కొట్టాడంటూ మనోజ్ లిఖిత పూరకంగా కంప్లైంట్ ఇచ్చాడని సమాచారం. దీనికి ప్రతిగా మోహన్ బాబు కూడా మంచు మనోజ్‌‌పై ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. మనోజే తనను కొట్టాడంటూ పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది.

Actor Mohan Babu and his son Manchu Manoj lodged complaint against each other

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ, ఓ స్కూల్.. మంచు కుటుంబానికి చెందినవనే విషయం తెలిసిందే. వీటి కార్యకలాపాల నిర్వహణ, ఇతర ఆస్తుల వ్యవహారంలో పరస్పర దాడులు జరిగినట్లు చెబుతున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో కొద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయని సమాచారం.

శరీరంగా అక్కడక్కడ గాయాలతోనే మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. తనతో పాటు భార్య భూమా మౌనిక రెడ్డినీ కొట్టాడని లిఖితపూరకంగా పోలీసులకు కంప్లైంట్ చేశారు. అదే సమయంలో మోహన్ బాబు కూడా ఎదురు కేసు పెట్టారు. తండ్రి అని కూడా చూడకుండా మనోజే తనను కొట్టాడంటూ మరో ఫిర్యాదు ఇచ్చారు.

ప్రస్తుతం మంచు మనోజ్.. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్‌తో కలిసి భైరవం సినిమాలో నటిస్తోన్నారు. గజపతి వర్మ పేరుతో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌‌ను పోషిస్తోన్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా దీన్ని సమర్పిస్తోన్నాయి. విజయ్ కనకమేడల దర్శకుడు. కేకే రాధామోహన్ నిర్మాత. ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, శరత్ లోహితాశ్వ, అజయ్.. ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+