జగన్‌పై దాడి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన టాలీవుడ్ ప్రముఖులు వీరే

YS Jagan injury: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరిన ఘటనలో ఆయన గాయపడ్డారు. ఈ ఉదంతం నేపథ్యంలో నేటి బస్సు యాత్రకు విరామం ఇచ్చారు జగన్. కేసరపల్లిలో ఏర్పాటు చేసిన తన బస్సు యాత్ర నైట్ క్యాంప్‌‌లో విశ్రాంతి తీసుకుంటోన్నారు.

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం ఆయన విజయవాడకు చేరుకున్న విషయం తెలిసిందే. చీకటి పడ్డాక వివేకానంద స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై రాయి విసిరారు. ఈ ఘటన జగన్ గాయపడ్డారు. ఎడమకంటి పైభాగం, నుదుటిపై గాయమైంది.

Actor Mohan Babu and Manchu Vishnu wishes to YS Jagan for a speedy recovery

అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేసుకున్న అనంతరం బస్సు యాత్రను యధాతథంగా కొనసాగించారు. రాత్రి విరామం అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో జగన్ భార్య వైఎస్ భారతి, ముఖ్యమంత్రి కార్యక్రమాల కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు ఉన్నారు.

డాక్టర్లు ఆయనకు చికిత్స అందించారు. గాయానికి కుట్లు వేశారు. మూడు కుట్లు వేసినట్లు సమాచారం. కొంత విశ్రాంతి అనంతరం జగన్ కేసరపల్లిలో ఏర్పాటు చేసిన తన బస్సు యాత్ర నైట్ క్యాంప్‌ కు బయలుదేరి వెళ్లారు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ డాక్టర్లు చేసిన సూచనలకు జగన్ సానుకూలంగా స్పందించడంతో నేటి బస్సుయాత్రకు బ్రేక్ ఇచ్చారు.

Actor Mohan Babu and Manchu Vishnu wishes to YS Jagan for a speedy recovery

వైఎస్ జగన్‌పై జరిగిన దాడి పట్ల ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు, హీరో మంచు విష్ణు స్పందించారు. ఈ దాడి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దాడిని దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మంచివి కావని వ్యాఖ్యానించారు.

ఆ షిర్డీ సాయినాథుడు, శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ఈ గాయం నుంచి వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని, నూతన శక్తితో తన విధులకు పునఃప్రారంభించాలని కోరుకుంటోన్నట్లు మోహన్ బాబు, మంచు విష్ణు చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.

జగన్‌పై దాడి పట్ల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. జగన్ కంటికి గాయమైన ఫొటోను ట్వీట్ చేశారు. అలాగే- నారా లోకేష్ వేసిన ట్వీట్ పట్ల ఆర్జీవీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ నారా లోకేష్‌కు బ్రెయిన్ మాత్రమే లేదని అనుకునే వాడినని, ఆయనకు హృదయం కూడా లేదని ఈ ట్వీట్ రుజువు చేసిందని అన్నారు. కంటికి ఒక అంగుళం కింద ఇదే రాయి మీకు తగిలితే అప్పుడు మీరు ఇలాగే స్పందిస్తారా? అని నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+