తండ్రికి తగ్గ తనయుడు జగన్... ప్రశంసలతో ముంచెత్తిన సినీనటుడు సుమన్
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు సినీ నటుడు సుమన్. పాలనలో తనదైన ముద్రవేస్తూ తండ్రికి తగ్గ తనయుడి సీఎం జగన్ అనిపించుకుంటున్నారని ప్రశంసలతో ముంచెత్తారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా పాలన కొనసాగిస్తున్నారని కితాబు ఇచ్చారు. ఇలాంటి ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదన్నారు.

జగన్ పుట్టినరోజు వేడుకలు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు ( డిసెంబర్ 21 )ను పురస్కరించుకుని గుంటూరులోని నిర్మల హృదయ భవన్‌లో వైసీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి సుచరిత, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, సినీనటుడు సుమన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మానసిన వికలాంగులకు, పేదలకు పండ్లు, స్వీట్లు , దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు.

వైసీపీ పాలనపై ప్రశంసలు
అనంతరం సినీనటుడు సుమన్ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పరిపాలన పై ప్రశంసలు కురిపించారు. అద్బుతంగా పాలన ఉందని అభినందించారు. గతంలో తాను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరి సీఎంల పనితీరు పరిశాలించానని చెప్పారు. అయితే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథాకాలు ఎవరూ అమలు చేయలేదని గుర్తు చేశారు. .

తండ్రిక తగ్గ తనయుడు
తండ్రికి తగ్గ తనయుడిగా, యంగ్ డైనమిక్ సిఎంగా జగన్ దూసుకెళ్తున్నారని సుమన్ కొనియాడారు. వైఎస్ఆర్ కంటే ఎక్కవ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందుతున్నారని కొనియాడారు. ప్రజలకు మరిన్ని సంక్షేమ పథాకాలు అందించాలన్నారు. సీఎం జగన్‌కు దేవుని , ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడు ప్రసాదించాలని భవవంతుడిని కోరుకుంటున్నట్లు సుమన్ తెలిపారు.

జగన్ పుట్టిన రోజు.. గ్రామ, సచివాలయ దినోత్సవం
మరో వైపు డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు ఆ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఓ కొత్త వ్యవస్థనను ఏర్పాటు చేసి లక్షా 34 వేలమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications