రేవ్ పార్టీ కేసులో జర్క్, నటి హేమ ఏం చెప్పారు, ఏం అడిగారంటే ?, అంతలేనిది ఎందుకు రాలేదు ?

బెంగళూరు రేవ్ పార్టీ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి వైద్యపరీక్షలు చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు ల్యాబ్ నుంచి రిపోర్టులు తెప్పించుకున్నారు. సినీనటి హేమతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం బెంగళూరులోని చామరాజపేటలోని సీసీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.

అయితే నటి హేమ తాను విచారణకు హాజరుకాలేనని బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాసిందని పోలీసు అధికారులు తెలిపారు. తనకు అనారోగ్యంగా ఉందని, ఇతర కారణాలు చూపిస్తూ విచారణకు హాజరుకాలేని నటి హేమ లేఖ రాసింది, విచారణకు హాజరుకావడానికి వారం రోజులు సమయం కావాలని ఆమె మనవి చేశారని కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సీసీబీ పోలీసు అధికారి ఒకరు అంటున్నారు.

Actress Hema has appealed to the Bengaluru police for a week s time to attend the inquiry

అయితే మిగిలిన 7 మంది ఎలాంటి లేఖలు రాయలేదని, వాళ్లు సోమవారం సాయంత్రం లోపు విచారణకు హాజరు అయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ మత్తులో మునిగిపోయిన అందరి జాతకాలు సేకరించిన బెంగళూరు సీసీబీ పోలీసులు వారికి నోటీసులు జారీ చేసి విచారణ చెయ్యడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలో ఇప్పటికే సాక్షాలు సేకరించిన పోలీసులు వాటి ఆదారంగా విచారణ చేస్తున్నారు.

బెంగళూరు రేవ్ పార్టీ రోజుకొక మలుపు తిరుగుతోంది. రేవ్ పార్టీ కేసులో నటి హేమను అరెస్టు చెయ్యకూడదని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు బెంగళూరు సీసీబీ పోలీసులపై ఒత్తిడి తీసుకు వచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ రాజకీయ నాయకులు ఎవరు ?, ఎందుకు నటి హేమను వదిలేయాలని పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారు అనే విషయం తెలియడం లేదని ఓ పోలీసు అధికారి అంటున్నారని కన్నడ మీడియా అంటోంది.

Actress Hema has appealed to the Bengaluru police for a week s time to attend the inquiry

అయితే ఇప్పటికే హేమాతో పాటు రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి వైద్యపరీక్షలు చెయ్యడం, డ్రగ్స్ సేవించారని వెలుగు చూసిన వారికి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చెయ్యడంతో కథ రసవత్తరంగా మారుతోంది. బెంగళూరు రేవ్ పార్టీకి, ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులకు ఏమైనా సంబంధం ఉందా ? అనే కోణంలో కూడా బెంగళూరు పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిసింది.

అవసరం అయితే ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి విచారణ చెయ్యాలని బెంగళూరు సీసీబీ పోలీసులు నిర్ణయించారని తెలిసింది. నటి హేమ తప్పు చెయ్యకుంటే విచారణకు రావడానికి ఎందుకు సమయం కావాలని అడుగుతున్నారని ఓ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద బెంగళూరు రేవ్ పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెలుతుందో అని ప్రజలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+