ఏపీ, తెలంగాణకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్
హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లకు అదనపు హాల్టులు ఇస్తున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీనిప్రకారం దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ జమ్మికుంట స్టేషన్‌లో, హజ్రత్ నిజాముద్దీన్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ వరంగల్, పెద్దపల్లి స్టేషన్లలో ఆగనున్నాయి. హైదరాబాద్-రాక్సల్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-రాయ్‌పూర్ హిస్సార్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పెద్దపల్లిలో, సికింద్రాబాద్-బీదర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ మర్పల్లి స్టేషన్లలో ఆగబోతున్నాయి.
లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇకనుంచి మిర్యాలగూడలో, నర్సాపూర్-లింగంపల్లి, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ, చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లకు నల్గొండలో హాల్ట్ లభించింది. ఇకనుంచి ఈ స్టేషన్లలో కూడా ఇవి ఆగనున్నాయి.

నాగర్‌సోల్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ మిర్యాలగూడలో, నర్సాపూర్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ నల్గొండలో, హైదరాబాద్-వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్ రైలుకు గద్వాలలో కూడా స్టాప్ లభించింది. నాగర్‌సోల్-చెన్నై సెంట్రల్, గోరఖ్‌పూర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, అంబేడ్కర్‌నగర్-యశ్వంత్‌పూర్ రైలుకు మహబూబ్‌నగర్‌లో, యశ్వంత్‌పూర్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ షాద్‌నగర్, జడ్చర్ల స్టేషన్లలో ఆగనున్నాయి. ఆరునెలలపాటు ప్రయోగాత్మకంగా ఆయా స్టేషన్లలో ఇవి ఆగుతాయి. ప్రయాణికుల ఆదరణను బట్టి వాటి కొనసాగింపు ఉంటుందని అధికారులు తెలిపారు.
రోజురోజుకు ప్రతి రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువవుతోంది. రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచడంతోపాటు మరికొన్ని సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లకు కొన్ని మీడియం స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఆయా స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను ఆధారంగా చేసుకొని వీటిని కొనసాగించడం లేదంటే ఆయా స్టేషన్లలో నిలిచే సౌకర్యం లేకుండా చేస్తారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications