తెలంగాణే బెస్ట్: అసెంబ్లీ సమావేశాలపై జగన్ పార్టీ ఎమ్మెల్యే సంచలనం

Subscribe to Oneindia Telugu
  AP Assembly Winter Session : తెలంగాణే బెస్ట్: అసెంబ్లీ సమావేశాలపై AP సంచలనం

  అమరావతి/హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడమంటే సమయం వృథా చేసుకోవడమేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డా. ఆదిమూలపు సురేష్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ వచ్చిన ఆయన ఇక్కడి శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.

  ఏపీ సమావేశాలతో టైమ్ వేస్ట్..

  ఏపీ సమావేశాలతో టైమ్ వేస్ట్..

  ఏపీలో తమ అసెంబ్లీకి వెల్లడం టైమ్ వేస్ట్ అని, తమకు మాట్లాడేందుకు ఐదు నిమిషాలు కూడా మైక్ ఇవ్వరని సురేష్ చెప్పారు. అయితే, తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు.

  తెలంగాణలో బెటర్

  తెలంగాణలో బెటర్

  ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం లభిస్తోందని చెప్పారు.
  అంతేగాక, ఇక్కడ శీతకాల సమావేశాలు ఇన్ని రోజులు జరుపుకోవడం విశేషమని అన్నారు.

  ఏపీలో అయితే..

  ఏపీలో అయితే..

  ఏపీలో అయితే బడ్జెట్ సమావేశాలే 14రోజులు దాటనివ్వరని విమర్శించారు. ఇక్కడ ప్రతిపక్షంగా కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉందని, కానీ, ఏపీలో అన్నింటిని తట్టుకుని వైసీపీ ప్రతిపక్షంగా నిలబడుతోందని అన్నారు.

  చంద్రబాబు తీరిది

  చంద్రబాబు తీరిది

  టీడీపీలో చేరుతున్న ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హార్డ్ క్యాష్ ఇవ్వడం లేదని, అంతా కాంట్రాక్టుల ద్వారా కమీషన్‌ను వారికి చేరవేస్తున్నారని ఆరోపించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా సర్కారు సొమ్మునే చంద్రబాబు ఖర్చుపెట్టారని దుయ్యబట్టారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YSRCP MLA Adimulapu Suresh on Tuesday said that Andhr assembly meetings

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి