తిరుమలలో ఆకస్మిక తనిఖీల్లో..

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 77,294 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 26,796 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.75 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏడు కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 నుండి 8 గంటల సమయం పట్టింది.

వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ చర్యలు చేపట్టింది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసింది. రెండు- మూడు సంవత్సరాల వేసవి డేటాను పరిగణనలోకి తీసుకుని భక్తుల సంఖ్య, వేచి ఉండే సమయం వంటి అంశాల ఆధారంగా భక్తుల కోసం పలు సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్నప్రసాదం, మంచినీటి పంపిణీ, నడక దారి భక్తులకు మార్గమధ్యలో షెడ్ల ఏర్పాటు, మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్ వేశారు.

AEO Venkaiah Chowdary Inspects Tirumala Site to House Central TTD Administrative Building Orders

అలాగే మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచి వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. వసతి సదుపాయాలు, అన్నప్రసాదం నిర్వహణను మరింత సమర్థంగా అమలు చేయనున్నారు. నడకదారి భక్తులు, అధిక రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తోన్నారు.

ఈ పరిణామాల మధ్య అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలో వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. తిరుమలలో కేంద్రీకృత టీటీడీ పరిపాలనా భవనాన్ని నిర్మించనున్న రామ్ భగీచా బస్టాండ్ కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆకాశగంగ వద్దకు చేరుకున్న అదనపు ఈవో దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు‌. శ్రీవారి సేవా సదన్ పక్కన ఉన్న లేబర్ షెడ్లను కూడా తనిఖీ చేశారు.

దీని తర్వాత తిరుమలలోని ఏటీసీ వద్దకు చేరుకున్న వెంకయ్య చౌదరి రెవెన్యూ విభాగానికి కాటేజీ కేటాయింపుపై స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో ఆయన వెంట తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ వేంకటేశ్వర్లు, వీజీవో సురేంద్ర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు శ్రీనివాసరావు, వేణు గోపాల్, డీఈ చంద్రశేఖర్, ఇతర అధికారులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+