APEPDCL: కరెంటు బిల్లులు ఈ యాప్స్ లో చెల్లిస్తున్నారా ? ఇక నో ఛాన్స్..

ఇప్పటివరకూ కరెంటు బిల్లు వచ్చిందంటే చాలు ఆఫీసుకో, చెల్లింపు కేంద్రానికో, మీసేవ కేంద్రానికో వెళ్లి చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా చెల్లించేస్తున్నారా ? ఇకపై అలా కుదరదు. ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా బిల్లుల చెల్లింపును అంగీకరించకూడదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ సంస్ధలు ఒక్కొక్కటిగా నిబంధనలను బయటపెడుతున్నాయి.

తాజాగా తెలంగాణలోని దక్షిణప్రాంత విద్యుత్ నియంత్రణ సంస్ధ (టీజీఎస్పీడీసీఎల్) తమ యాప్ లేదా వెబ్ సైట్ లో కాకుండా మరే ఇతర థర్డ్ పార్టీ యాప్ లు, వెబ్ సైట్ల ద్వారా బిల్లుల చెల్లింపు కుదరరని తేల్చిచెప్పేసింది. అలా కుదరదంటే నేరుగా కరెంటు ఆఫీసుకు వెళ్లి బిల్లుల చెల్లింపు చేయాల్సిందే. ఇవాళ ఏపీలో కూడా తూర్పు ప్రాంత విద్యుత్ నియంత్రణ సంస్ధ (ఈపీడీసీఎల్) కూడా ఇదే బాట పట్టింది.

after TGSPDCL APEPDCL also removes payment option via third party apps according to rbi guidelines

ఆర్బీఐ తాజాగా తెచ్చిన నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపును కూడా థర్డ్ పార్టీ యాప్ ల్లో నిలిపేస్తున్నారు. అక్రమాల నియంత్రణకు ఆర్బీఐ కొత్తగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)ను తీసుకొచ్చింది. ఇందులో రిజిస్టర్ అయిన ప్రభుత్వ సంస్ధలు, బ్యాంకులు ఆయా ప్లాట్ ఫామ్ ద్వారా తమ బిల్లుల్ని వినియోగదారుల నుంచి స్పీకరించే వీలుంది. అలా కాదని థర్డ్ పార్టీ యాప్ లకు ఈ బాధ్యత అప్పగించడం కుదరదు. దీంతో ఇప్పటివరకూ ఈ థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా బిల్లుల చెల్లింపులు చేస్తూ క్యాష్ బ్యాక్ లు, ఆఫర్లు పొందుతున్న వినియోగదారులకు పెద్ద షాక్ తగిలినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+