కడప జిల్లాలో వైసీపీకి భారీ షాక్

సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడగా... తాజాగా సీఎం జగన్ సొంత జిల్లాలోనే అధికార పార్టీకి భారీ షాక్ తగిలింది. కడప జిల్లాలో మైనారిటీ నేత పార్టీకి రాజీనామా చేశారు.

కడప జిల్లా ప్రధాన కార్యదర్శి అఫ్జల్ ఖాన్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపారు. కడప అసెంబ్లీ టికెట్ ఆశించిన అఫ్జల్ ఖాన్‌కు నిరాశ ఎదురైంది. జగన్ ప్రకటించిన జాబితాలో అఫ్జల్ ఖాన్ లేకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో ఆయన కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Afzal Khan resigns from YCP

అఫ్జల్ ఖాన్‌ అసంతృప్తితో ఉన్నారని తెలిసినప్పటికీ కూడా ఆయనతో పార్టీ అధిష్టానం ఎలాంటి సంప్రదింపులు, బుజ్జగింపు కార్యక్రమాలు చేపట్టలేదు.పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన్ను దూరం పెట్టిన పరిస్థితి. ఇన్ని అవమానాల మధ్య ఇంకా పార్టీలో ఉండటం సమంజసం కాదని భావించిన అఫ్జల్ ఖాన్ వైసీపీకి రాజీనామా చేశారు.

సోమవారం సాయంత్రం ఆయన పార్టీ సభ్యత్వంతో పాటు, కార్యదర్శి పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ.. కడప సీటు తనకిస్తానని సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. కార్యకర్తలతో చర్చించి త్వరలో తన రాజకీయ కార్యచరణ ప్రకటిస్తానని అఫ్జల్ ఖాన్ తెలిపారు. ఆయన షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+