పవన్ కళ్యాణ్ పిలిస్తే.. కోరిక బయటపెట్టిన లేడీ అఘోరీ!

మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నానా హంగామా చేసిన లేడీ అఘోరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హల్ చల్ మొదలుపెట్టింది. విశాఖపట్నం సమీపంలోని జోడుగుళ్లపాలెం నాగ క్షేత్రంలో లింగాభిషేకపూజలలో పాల్గొని అక్కడికి వచ్చిన భక్తులను దీవించిన లేడీ అఘోరి సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వానికి లేడీ అఘోరీ సవాల్
తనను, తన పూజలను ప్రభుత్వాలకు దమ్ముంటే ఆపాలని సవాల్ చేసింది .లోక కళ్యాణం కోసం తాను వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పింది. హిందూ మతం, సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని ఈ పరిస్థితుల్లో మా అఘోరాలు, నాగ సాధువులు సనాతన ధర్మ రక్షణకు లోకకళ్యాణం కోసం జనాలలోకి రావాల్సి వచ్చిందని అఘోరి పేర్కొంది.

Aghori Nagasadhu reveals her desire over ap deputy cm pawan kalyan

హిందూ ధర్మం ప్రమాదంలో ఉంటే వస్తాం
ఎవరైతే హిందూ ధర్మ రక్షణ కోసం ప్రశ్నిస్తున్నారో వారి పైన కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారని హిందూ ధర్మం కోసం ప్రశ్నించే వారిని అణిచివేస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. అఘోరీలు, నాగ సాధువులు అంటే కేవలం స్మశానాలు, హిమాలయాలు కాదని పేర్కొంది. తాము హిందూ ధర్మం ప్రమాదంలో పడినప్పుడు ఖచ్చితంగా తమ వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తామని అఘోరి స్పష్టం చేస్తుంది.

త్వరలోనే తానేమిటో చూపిస్తానన్న లేడీ అఘోరీ
సనాతన ధర్మ రక్షణకు తన ప్రాణత్యాగానికైనా వెనకాడనని పేర్కొంది. ఇక తాను కుంభమేళాకు వెళతానని కావాలంటే ట్రాక్ చేసుకోవాలని సూచించింది. తాను ఎక్కడికి వెళ్లినా మళ్ళీ తిరిగి వస్తానని త్వరలో తానేంటో చూపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది లేడీ అఘోరి.

పవన్ కళ్యాణ్ పై లేడీ అఘోరీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానని పేర్కొంది. పవన్ కళ్యాణ్ విషయంలో తన మనసులోని కోరికను బయటపెట్టింది. పవన్ కళ్యాణ్ కు తన ఆశీస్సులు ఉంటాయని పేర్కొంది. పవన్ కళ్యాణ్ కు ఏదైనా కష్టం వస్తే తాను అండగా ఉంటానని లేడీ అఘోరీ చెప్పింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంట్రీ ఇవ్వడంతోనే టోల్ ప్లాజా దగ్గర అఘోరి హల్ చల్ చేసింది. అనకాపల్లిలోని నక్కపల్లి టోల్ ప్లాజా సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ హంగామా సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+