Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అదిరిపోయే ఆఫర్: రైలు టికెట్ ధరకే విమానం టికెట్

విమాన ప్రయాణాలు ఖర్చుతో కూడుకున్నవి. దసరా, దీపావళి, క్రిస్మస్‌ వంటి పండుగ ఆఫర్లతో తక్కువ ధరలకే అందుబాటులో ఉంటున్నాయి. ఎయిరిండియా సంస్థ క్రిస్మస్ కమ్ ఎర్లీ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లతో జాతీయ, అంతర్జాతీయ విమానాల్లో ఊహించనిరీతిలో తగ్గింపు ధరతో ప్రయాణాలు చేయవచ్చు. ప్రయాణీకుల సౌలభ్యం కోసం 30 శాతం వరకు డిస్కౌంట్స్‌ని ఎయిర్‌ ఇండియా అందిస్తోంది. ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్‌ లేదంటే ఏదైనా థర్డ్ పార్టీ పోర్టల్ ద్వారా వినియోగదారులు ఈ తగ్గింపు ఆఫర్‌ని పొందొచ్చు. ఇప్పుడు టికెట్లు తీసుకున్నవారు డిసెంబర్ 2, 2023 నుంచి మే 30, 2024 మధ్యలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ఈ నెలలో టికెట్లు తీసుకున్నవారికే ఇయర్‌ ఎండ్‌, క్రిస్మస్‌ ఎర్లీ ఆఫర్ చెల్లుబాటవుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. క్రిస్మస్‌ ఎర్లీ ఆఫర్‌లో లాగిన్ అయిన సభ్యులకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. డిన్నర్‌, కాంప్లిమెంటరీ ఎక్స్ ప్రెస్ అహెడ్ సర్వీసెస్, జీరో కన్వీనియన్స్ ఫీజు ఉంటుంది. అలాగే టాటా న్యూపాస్ రివార్డ్స్ ప్రోగ్రామ్ మెంబర్స్‌ న్యూకాయిన్లలో 8 శాతం రాయితీని పొందుతారు.

air india year end offers details here

ఈ సేల్ ఆఫర్‌లో కొన్ని రూట్లను మాత్రమే ఎయిర్ లైన్స్ లిస్టు చేసింది. ఈ లిస్ట్‌లో బెంగళూరు-కన్నూర్, బెంగళూరు-తిరువనంతపురం, బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-మంగళూరు, కన్నూర్-తిరునంతపురం, చెన్నై-తిరువనంతపురం, బెంగళూరు-తిరుచిరాపల్లి మార్గాల్లో రాయితీ ఛార్జీలున్నాయి. వీటిని పొందాలంటే ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌ ఆఫర్లను పొందొచ్చు. హైదరాబాద్ ను లక్నో, కొచ్చి, అమృత్ సర్ లతో కలిపే కొత్త రూట్లను ఎయిర్‌ ఇండియా ప్రవేశపెట్టింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+