భ‌క్తుల‌కు అల‌ర్ట్ : శ్రీ‌వారి స‌న్నిధిలో ఆగ‌స్టులో జ‌రిగే విశేష ఉత్స‌వాలు ఇవే..

తిరుమ‌ల వెళ్లే భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. స్వామివారి స‌న్నిధిలో ఆగ‌స్టులో జ‌రిగే విశేష ఉత్స‌వాల వివ‌రాల‌ను టీటీడీ తాజాగా ప్ర‌కటించింది. తిరుమ‌ల ఆల‌యంలో ప్ర‌తి నెల విశేష ఉత్స‌వాలు జ‌రుగుతుంటాయి. ఆ షెడ్యూల్‌ను ముందుగానే ఆల‌య అధికారులు ప్ర‌క‌టిస్తుంటారు. ఆ జాబితా ఏంటో ఓసారి చూసేద్దాం..

తిరుమ‌ల ఆల‌యంలో ఆగస్టు 4 వ తేదిన శ్రీ చక్రత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం కార్యక్రమాలు జ‌రుగుతాయి. ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేసే కార్యక్రమం నిర్వ‌హిస్తారు. ఆగస్టు 9న గరుడ పంచమి సంద‌ర్భంగా తిరుమల స‌న్నిధిలో శ్రీవారి గరుడ సేవ కార్య‌క్ర‌మం ఉంటుంది. ఇక‌, ఆగస్టు 10న కల్కి జయంతి, 13వ తేదిన తరిగొండ వెంగమాంబ వర్ధంతి కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. ఆగస్టు 14వ తేద‌న తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Alert to Devotees These are the special festivals held in the presence of Srivari in August

ఇక‌, ఆగస్టు 15వ తేదీన భారత స్వాతంత్ర్య దినోత్సవంతో పాటుగా స్మార్త ఏకాదశి కార్య‌క్ర‌మం కూడా ఉంటుంది. అదే రోజు నుంచి తిరుమల స్వామివారి స‌న్నిధిలో పవిత్రోత్సవాలు ప్రారంభ‌మ‌వ‌తుఆయి. ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం ఉంటుంది. అదే రోజున నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం కార్యక్రమాలు ఉంటాయి. ఆగస్టు 19వ తేదిన శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల ఆ ల‌యంలో పౌర్ణమి గరుడ సేవ కార్యక్ర‌మం ఉంటుంది. వీటితో పాటు ఆగ‌స్టు నెల‌లో రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, విఖ‌న‌స మ‌హాముని జ‌యంతి కార్యక్రమాలను కూడా ఎంతో వైభ‌వంగా నిర్వ‌హిస్తారు.

ఆస్థానం కార్యక్రమం...

ఇక‌, ఈ ఉత్స‌వాల‌కు ఆల‌య అధికారులు ప్ర‌త్యేక ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. తిరుమ‌ల ఆల‌యంలో నిత్యం ర‌ద్దీగానే ఉంటుంది. ఇక‌, విశేష ఉత్స‌వాల సంద‌ర్భంగా ఇక్క‌డ భ‌క్తులు పోటెత్తుంటారు. ఈ విశేష కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యే శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ త‌గు చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఆగస్టు 20వ తేదీన శ్రీవారు విఖనసాచార్య స్వామివారి సన్నిధికి వేంచేస్తారు.

ఆగ‌స్టు 27న శ్రీ‌కృష్ణాష్టమి పర్వదినం ఉంటుంది. ఈ పండుగ సంద‌ర్భంగా శ్రీవారి ఆలయంలో ఆస్థానం కార్యక్రమం కూడా నిర్వ‌హిస్తారు. ఇక‌, ఆగస్టు 28న శ్రీ‌వారి శిక్యోత్సవం కార్య‌క్ర‌మం నిర్వహించినున్నట్లు ఆల‌య అధికారులు పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే స్వామివారి భక్తులు ఈ కార్యక్రమాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని టీటీడీ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+