Araku Festival: చలి పండుగకు సిద్దమైన అరకు-రేపట్నుంచి కార్యక్రమాలివే..!

ఏపీలో పర్యాటక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పర్యాటక ప్రాంతాల్లో పండుగలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోనూ చలి పండుగ నిర్వహించేందుకు సిద్దమైంది. మూడు రోజుల పాటు జరిగే అరకు చలి పండుగ రేపు (శుక్రవారం) ప్రారంభం కానుంది. ఇందులో పర్యాటకుల కోసం పలు ఆకర్షణనీయమైన కార్యక్రమాలను, పోటీలను ఏర్పాటు చేస్తున్నారు.

అరకు లోయలోని ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్స్ లో ఈ చలి పండుగను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో తొలి రోజు అయిన రేపు ఉదయం 7.30 నుంచి 10.30 వరకూ పద్మాపురం గార్డెన్ నుంచి కార్యక్రమ ప్రధాన వేదికైన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ వరకూ అరకు మారథాన్ పరుగు నిర్వహిస్తారు. 11 గంటలకు పద్మాపురం గార్డెన్స్ లో ఫ్లవర్ షో, 12 గంటలకు అరకు ట్రైబల్ మ్యూజియంలో పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫుడ్ స్టాల్స్ ప్రారంభం అవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు పద్మాపురం గార్డెన్స్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకూ కార్నివాల్ పరేడ్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు సాంస్కృతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇందులో సంప్రదాయ గిరిజన నృత్యాలు ఉంటాయి.

all set for araku festival 2025 from tomorrow- here is complete details of programmes

అనంతరం ఎల్లుండి అంటే ఫిబ్రవరి ఒకటో తేదీన బొర్రా గుహల నుంచి అరకు డిగ్రీ కాలేజ్ వరకూ సైక్లింగ్ ఈవెంట్ ఉంటుంది. అరకు ఎంపీడీవో ఆఫీసు వద్ద 11 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. 12 గంటలకు డిగ్రీ కాలేజ్ లో అరకు బొకే ఇనాగరేషన్ ఉంటుంది. అనంతరం వాటి అమ్మకాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 2 గంటలకు అరకు కాఫీ హౌస్ లో కాఫీ పరిచయం ఉంటుంది. అక్కడే 3 గంటల నుంచి 4 గంటల వరకూ వక్తలు కాఫీ ప్రత్యేకతపై మాట్లాడతారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి ఫ్యాషన్ షో, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

తిరిగి ఫిబ్రవరి 2న ఆదివారం ఉదయం 7 గంటలకు అరకు సుంకమెట్ట కాఫీ తోటల నుంచి అరకు ట్రెక్ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి అరకులో వాల్ పెయింటింగ్, 11 గంటలకు ముగ్గుల పోటీ ఉంటుంది. 12 గంటలకు ట్రైబల్ మ్యూజియంలో ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు మగింపు కార్యక్రమాలు, సాంస్కృతి కార్యక్రమాలు, లేజర్ షో కూడా ఉంటాయి. అలాగే ఈ మూడు రోజుల పాటు అరకులో హెలికాఫ్టర్ రైడ్ కూడా పర్యాటకుల కోసం అందుబాటులో ఉంచుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+