Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పంచ్ ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్ధం-సీబీఐ ఇంటర్ పోల్ బ్లూ నోటీసు జారీ- మరో నిందితుడికీ

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై, వారి తీర్పులపై సోషల్ మీడియాలో పోస్టులు, యూట్యూబ్ లో వీడియోలు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సానుభూతిపరుడు పంచ్ ప్రభాకర్ పై సీబీఐ వల విసురుతోంది. ఈ కేసులో పంచ్ ప్రభాకర్ అరెస్టు కోసం ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇవాళ ఇంటర్ పోల్ ద్వారా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇంటర్ పోల్ అధికారులు వివిధ దేశాల్లో గాలింపు చేపట్టబోతున్నారు.

పంచ్ ప్రభాకర్ అరెస్టు కోసం సీబీఐ ఇంటర్ పోల్ ద్వారా బ్లూ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. పంచ్ ప్రభాకర్ తో పాటుగా విదేశాల్లో ఉంటున్న మరో నిందితుడికి కూడా సిబిఐ అధికారులు బ్లూ నోటీస్ జారీ చేసింది. హైకోర్టు జడ్డీలపై దూషణలు చేసిన ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ పదకొండు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. విదేశాలలో ఉన్న నిందితులపై అరెస్ట్ వారెంట్లు జారీచేసి, వారిని అరెస్టు చేయడానికి దౌత్య ఛానెళ్ల ద్వారా ప్రక్రియ ప్రారంభించబడిందని సీబీఐ ప్రకటన విడుదల చేసింది.
న్యాయమూర్తులు మరియు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్ట్‌లు పెట్టడానికి సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిపై సీబీఐ ప్రత్యేక ఛార్జిషీట్‌లను దాఖలు చేసింది.

all set for ysrcp activist punch prabhakar arrest as cbi issued interpol notice in social media post case

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక హైకోర్టులో ప్రభుత్వానికి ప్రతికూలంగా పలుప తీర్పులు రావడంతో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు వైసీపీ సానుభూతిపరులు హైకోర్టుతో పాటు తీర్పులపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... తొలుత సీఐడీ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. కానీ సీఐడీ సక్రమంగా దర్యాప్తు చేయకపోవడంతో సీబీఐకి అప్పగించింది. అయితే సీబీఐ కూడా వైసీపీ నేతలపై దూకుడుగా వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. దీంతో తాజాగా హైకోర్టు సీబీఐపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పంచ్ ప్రభాకర్ ను పది రోజుల్లో అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీబీఐ ఇంటర్ పోల్ నోటీసు జారీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+