ఏలూరు YCPలో బిగ్ బ్రేకింగ్?
విలక్షణమైన తీర్పులకు ఏలూరు ఓటరు పెట్టింది పేరు
రాజకీయాల్లో ఏలూరు జిల్లా రాజకీయం వేరు. విలక్షణమైన తీర్పులకు ఇక్కడి ఓటర్లు పెట్టింది పేరు. ప్రస్తుతం ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతోన్న ఆళ్ల నాని వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మొదటి విడత మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిన నాని మృదు స్వభావి. ప్రత్యర్థులపై విమర్శలు కూడా చాలా తక్కువగా చేయడంతోపాటు చక్కటి భాషనే ఉపయోగిస్తారు.

ఎంపీగా పోటీచేయడానికి ఆసక్తిగా ఉన్నారంటున్న అనుచరులు
రెండో విడత మంత్రివర్గ విస్తరణలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొట్టు సత్యనారాయణకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి నాని అసంతృప్తితో ఉన్నారంటున్నప్పటికీ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారుకానీ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో నిర్వహిస్తోన్న కార్యక్రమంలో ఆళ్ల నాని వెనకబడివున్నట్లు సమావేశంలో వైఎస్ జగన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయడం ఇష్టంలేదని, ఎంపీగా పోటీచేయడానికే ఆసక్తి చూపుతున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు.

పోటీకి దిగితే గెలవడం సులభం
కాపు సామాజికవర్గానికి చెందిన నాని ఎంపీగా పోటీకి దిగితే గెలవడం సులభమనే అభిప్రాయంలో ఉన్నారు. ఏలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాపు సామాజికవర్గానిదే ఆధిపత్యం. ప్రస్తుత ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ వెలమ సామాజికవర్గానికి చెందినవారు. సామాజికవర్గాల కోణంలో గత ఎన్నికల సమయంలో ఎంపీ సీటును శ్రీధర్ కు వైసీపీ అధిష్టానం కేటాయించింది.

పట్టుబడుతున్న నాని
వచ్చే ఎన్నికలకు మాత్రం ఎంపీ సీటు తనకు కేటాయించాల్సిందేనని నాని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఉంగుటూరు లేదంటే ఏలూరు నుంచి శ్రీధర్ ను ఎమ్మెల్యేగా పోటీచేయించాలని నాని అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీధర్ కూడా అసెంబ్లీకి వెళదామనే యోచనలో ఉండటంతో ఇరువైపులా ఇబ్బంది లేదని భావిస్తున్నారు.
తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి దక్కించుకోవచ్చనే యోచనలో కోటగిరి ఉన్నారు. ఏలూరు పరిధిలో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేస్తే టఫ్ ఫైట్ జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున వరుసగా 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందిన నాని 2014 ఎన్నికల్లో బడేటి బుజ్జి చేతిలో ఓటమిపాలయ్యారు. తిరిగి గత ఎన్నికల్లో గెలుపొందారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications