బీజేపీతో పొత్తు.. కానీ కాంగ్రెస్ కు మేలు చేస్తున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అనే అంశం అర్థం కాకుండా తయారయింది. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటు కూటమి, అటు కాంగ్రెస్ మూకుమ్మడిగా దాడి చేస్తున్నవేళ అనేక సందర్భాలలో చంద్రబాబు వైఎస్ షర్మిలకు మద్దతు తెలుపుతున్నట్టుగా మాట్లాడడం ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.

ఆస్తి కొట్టేసి చెల్లికి అప్పిచ్చిన జగన్
తాజాగా చంద్రబాబు జగన్ సోదరి కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల తన నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్న అప్పుల అంశాన్ని ప్రస్తావించి షర్మిల తన అన్న జగన్ వద్ద, వదిన భారతి వద్ద 82కోట్లకు పైగా అప్పులు తీసుకున్నారని పేర్కొన్నారన్నారు. ఆ తర్వాత ఆమె దీనిపై వివరణ కూడా ఇచ్చారని పేర్కొన్న చంద్రబాబు తండ్రి ఆస్తి మొత్తాన్ని కొట్టేసిన దుర్మార్గుడు జగన్, చెల్లికే అప్పు ఇస్తావా అంటూ విమర్శించారు.

Alliance with BJP but Chandrababu is doing favor for Congress and ys sharmila

చెల్లిని వేధిస్తున్న అన్న జగన్
ఇలాంటి వ్యక్తిని సైకో కాక ఇంకేమనాలి అంటూ ప్రశ్నించారు. ఎవరైనా తోబుట్టువులు కష్టాల్లో ఉంటే ఆదుకుంటారని, కానీ జగన్ తన పార్టీని కాపాడడం కోసం పాదయాత్ర చేసి అండగా ఉన్న చెల్లి షర్మిలను వేధిస్తున్నారని, ఆమెకే అప్పులు ఇచ్చాడని, ఇంతకన్నా సైకో కి ఇంకేం ఉదాహరణ కావాలంటూ ప్రశ్నించారు.

చెల్లికే అప్పిచ్చి వడ్డీ వ్యాపారం చేస్తున్న జగన్
వాస్తవంగా షర్మిల తన తండ్రి ఆస్తిలో వాటా కోరారని, అదేమీ జగన్ సంపాదించిన ఆస్తి కాదన్న చంద్రబాబు, అది వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడబెట్టిన ఆస్తి, అందులో షర్మిలకు వాటా ఉందని ఆమెనే చెప్పారన్నారు. కానీ ఈ సైకో ఆస్తిలో వాటా ఇవ్వకుండా చెల్లితోనే వడ్డీవ్యాపారం చేస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు. సొంత చెల్లెలికి న్యాయం చేయలేని జగన్ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడో మీరే తేల్చుకోవాలి అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

Alliance with BJP but Chandrababu is doing favor for Congress and ys sharmila

పరోక్షంగా షర్మిలకు చంద్రబాబు మద్దతు
ఈ ఎన్నికలు రాష్ట్రానికి ఒక సైకో పాలనకు జరుగుతున్న ఎన్నికలని చంద్రబాబు తేల్చి చెప్పారు. జగన్ మహిళలను ఎంతగా వేధిస్తున్నాడో షర్మిలను, వివేకా కుమార్తె సునీతను చూస్తే అర్థమవుతుందని చంద్రబాబు అన్నారు. జగన్ ను మళ్లీ గెలిపిస్తే మీ బతుకులు కూడా నాశనం చేస్తాడని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు తాజా వ్యాఖ్యలలో జగన్ ను టార్గెట్ చేయడానికి, ఆయన పరోక్షంగా షర్మిలకు మద్దతు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది.

బీజేపీతో పొత్తు.. షర్మిలపై సానుభూతి
ఒకపక్క కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువైన బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు షర్మిల పైన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చకు కారణంగా మారాయి. జగన్ మీద వ్యతిరేకత కోసం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తున్నాడు అన్న టాక్ వినిపిస్తుంది. మరి ఈ వ్యవహారంలో బీజేపీ స్పందన ఏంటో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+