ఇది కదా బ్రాండ్ అంటే ..పవన్‌కు మరోసారి స్టామినా నిరూపించిన అల్లు అర్జున్
మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం అందరికి తెలిసిందే. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.
Nandyal incident just sample ra AAths #Pushpa2 ki untadi asalina AAta 🦊
— अतुल्य भारत (@NitishD84451) June 12, 2024
REBEL STORM LOADING 💥🔥 pic.twitter.com/S0C2avUTqy
దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం..అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. కిర్రాక్ ఆర్పీ వంటి ఆర్టిస్టులు నేరుగానే అల్లు అర్జున్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం గట్టిగానే కౌంటరిస్తున్నారు.పవన్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న తరుణంలో అల్లు అర్జున్ నటించిన పుష్ఫ-2 సినిమాను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చారు.దీంతో పవన్ అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ గట్టిగానే కౌంటరిచ్చారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.నంద్యాల ఎన్నికలు జస్ట్ శాంపల్ మాత్రమే అని భవిష్యత్తులో అసలైన ఆట ఏమిటో చూపిస్తామంటూ అల్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Personally after Mahesh Babu I will support this monster
— Chillaxxx (@naveeenRe_ddy07) June 12, 2024
Box office monster 💥#Pushpa2pic.twitter.com/Kc06ChhEyy












Click it and Unblock the Notifications