పవన్ కల్యాణ్‌తో వార్‌కు ముగింపు పలికిన అల్లు అర్జున్

మెగా వార్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముగింపు పలికారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్‌కు ధన్యవాదాలు తెలిపారు. పుష్ప-2 సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ..టిక్కెట్ పెంపును ఆమోదించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల మరియు శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుందని ఆయన చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు అల్లు అర్జున్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వైరానికి తెర పడినట్టే అని అభిమానులు భావిస్తున్నారు. గత కొద్దిరోజులుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.

Allu Arjun special tweet on pawan kalyan

ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపించింది. ఇక మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య అయితే వార్ తారస్థాయికి చేరుకుంది. సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానులు యుద్దం చేసుకుంటున్నారు. నాగబాబు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ట్వీట్ చేయడం, పవన్ కల్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడటం జరిగింది. ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరించారు.

వీరికి కౌంటర్‌గా అల్లు అర్జున్ ..నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా.. అది మీ అందరికి తెలుసంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్టు అయింది. అయితే తాజాగా ఈ వార్‌కు అల్లు అర్జున్ ముగింపు పలికారు. ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ పవన్ కల్యాణ్‌ పేరును ప్రస్తావించడంతో ఈ వివాదానికి తెర పడినట్టు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+