ఆమంచికి జ‌గ‌న్ ఫోన్ : వైసిపి లో చేరిక ఖ‌రారు: బ‌ల‌రాం కు చీరాల బాధ్య‌త‌లు..!

ఊహించిందే జ‌రుగుతోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వైసిపి లో చేర‌టానికి రంగం సిద్ద‌మైంది. ముఖ్య‌మం త్రి పిలిచి ఆమంచిని బుజ్జ‌గించారు. అంతా తాను చూసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. అయినా..ఆమంచి మ‌న‌సు మార‌లే దు. కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో తాను పార్టీ మారుతున్న‌ట్లు తేల్చి చెప్పేసారు. దీంతో..చీరాల లో పార్టీకి ప్ర‌త్యామ్నాయం పై చంద్ర‌బాబు దృష్టి సారించారు. సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌లారం ను చీరాల వెళ్లాల‌ని ఆదేశించారు.

ఆమంచి కి జ‌గ‌న్ ఫోన్...హామీ..!

ఆమంచి కి జ‌గ‌న్ ఫోన్...హామీ..!

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మెహ‌న్ కొద్ది రోజల క్రితం అభిమానుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. తాను టిడిపి వీడి వైసిపి లో చేరాల‌నే అంశం పై అభిప్రాయ సేక‌ర‌ణ చేసారు. దీంతో..టిడిపి అధినాయ‌క‌త్వం అప్ర‌మ‌త్తం అయింది. జిల్లా మంత్రిని రంగంలోకి దించింది. సీయం..లోకేష్ నేరుగా ఫోన్ లో మాట్లాడారు. అమ‌రావ‌తి వ‌చ్చిన ఆమంచి కృష్ణ మోహ‌న్ అమ‌రావ తి వ‌చ్చి ముఖ్య‌మంత్రితో స‌మావేశ‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలోనే టిడిపిలో కొన‌సాగే అంశం పై ఎటువంటి హామీ ఇవ్వ‌లే దు. తాజాగా, వైసిపి అధినేత జ‌గ‌న్ నేరుగా ఆమంచి కృష్ణ‌మోమ‌న్ కు ఫోన్ చేసారు. పార్టీలోకి రావాల‌ని..స‌ముచిత ప్రాధా న్య‌త ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వ‌స్తే మంచి స్థానంలో ఉంటారంటూ అభ‌యం ఇచ్చారు. ఇదే విష యాన్ని ఆమంచి త‌న స‌న్నిహితులో చ‌ర్చించారు. ఇక‌, వైసిపి లో చేరాల‌ని డిసైడ్ అయ్యారు.

క‌ర‌ణం కు చీరాల బాధ్య‌త‌లు..

క‌ర‌ణం కు చీరాల బాధ్య‌త‌లు..

ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఇక టిడిపి వీడి వైసిపి లో చేరాల‌ని నిర్ణ‌యించ‌టంతో టిడిపి అధినాయ‌క‌త్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ విష‌యం ఖ‌రారు కాగానే..వెంట‌నే టిడిపి అధినేత ప్ర‌కాశం జిల్లా టిడిపి సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌లరాం ను వెంట‌నే చీరాల వెళ్లాల‌ని ఆదేశించారు. అక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన పోత‌లు సునీత తో వెళ్లి..పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం ఏర్పాటు చే యాల‌ని ఆదేశించారు. చీరాల లోని పార్టీ శ్రేణుల‌కు సమాచారం ఇచ్చారు. క‌ర‌ణం బ‌ల‌రాం పార్టీ కార్య‌క‌ర్త ల స‌మావేశం ఏ ర్పాటు చేస్తార‌ని.. అందులో పాల్గొనాల‌ని పార్టీ శ్రేణుల‌ను రాష్ట్ర పార్టీ కార్యాల‌యం నుండి ఆదేశాలు వెళ్లాయి. ఆమంచి పార్టీ వీడ‌టం వ‌ల‌న ఎటువంటి నష్టం లేద‌ని చెబుతూనే..అక్క‌డ పార్టీ లో ఎటువంటి న‌ష్టం లేకుం డా ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం చేసే బాధ్య‌త‌ల‌ను క‌ర‌ణం బ‌ల‌రాం కు అప్ప‌గించారు.

బ‌ల‌రాం..సునీత‌..ఎవ‌రికి అవ‌కాశం...

బ‌ల‌రాం..సునీత‌..ఎవ‌రికి అవ‌కాశం...

ఇప్పుడు చీరాల లో టిడిపి అభ్య‌ర్ది ఎవ‌రనే చ‌ర్చ మొద‌లైంది. ఆమంచి కృష్ణ‌మోమ‌న్ వైసిపి నుండి ఇక్క‌డ పోటీ చేయ టం దాదాపు ఖ‌రారైంది. ఈ ప‌రిస్థితుల్లో వైసిపి లో ఉన్న అసంతృప్తుల‌ను చేర‌దీయాల‌ని టిడిపి నిర్ణ‌యించింది. ఇదే స‌మ‌యంలో ఇక్క‌డ నుండి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడి..ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీను టిడిపి అభ్య‌ర్ది గా ప్ర‌క‌టించాలా లేక క‌ర‌ణం బ‌ల‌రాం త‌న‌యుడికి అవ‌కాశం ఇవ్వాలా అనే దాని పై టిడిపి అధినాయ‌క‌త్వం ఆలోచ‌న చేస్తోంది. క‌ర‌ణం బ‌ల‌రాం ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉండ‌గా, ఆయ‌న త‌న‌యుడు గ‌త ఎన్నిక‌ల్లో అద్దంకి లో పోటీ చేసి ఓ డారు. గ‌త ఎన్నిక‌ల్లో అద్దంకి నుండి గెలిచిన గొట్టిపాటి ర‌వి కుమార్ ప్ర‌స్తుతం టిడిపి అభ్య‌ర్దిగా బరిలోకి దిగుతున్నారు. దీంతో..చీరాల లో ఎవ‌రికి అవ‌కాశం ఇస్తార‌నే దాని పై త‌ర్జ‌న భ‌ర్జ‌న లు జ‌రుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+