అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్!!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్(amazon Great Indian Festival Sale) ప్రారంభమైంది. ఫెస్టివల్ సీజన్లో కొనుగోలుదారులకు అదిరిపోయే ఆఫర్ లను ఇస్తూ మొదలైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న సభ్యులకు నేడు అందుబాటులోకి వచ్చింది. ఈరోజు అర్ధరాత్రి 12గంటల నుండి సాధారణ యూజర్లకు కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అందుబాటులోకి రానుంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ డీల్స్ కోసం అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ (Amazon Prime Shopping Edition Plan) ను కూడా అందిస్తుంది. ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు చాలా ప్రత్యేకమైనది. ఇక ఈ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ ను 399 రూపాయలుగా అమెజాన్ పేర్కొంది . ఈ subscription ప్రయోజనాలలో ఉచిత షిప్పింగ్ మరియు వన్డే డెలివరీలు ఉండడం గమనార్హం.

Amazon Prime Shopping Edition Plan for amazon Great Indian Festival Sale!!

అయితే ప్రైమ్ మ్యూజిక్, వీడియోలు, గేమింగ్ రీడింగ్ వంటి మరిన్ని ప్రయోజనాలు ఈ ప్లాన్ కు వర్తించవని అమెజాన్ పేర్కొంది. కంపెనీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ 1499 రూపాయలు మరియు 999 రూపాయలకు అమెజాన్ ప్రైమ్ లైట్ రెండు వార్షిక సభ్యత్వాలను అందిస్తుంది.ఇక తాజా సేల్ కోసం అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ తీసుకొచ్చింది.

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కు ఒక రోజు ముందు అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. నివేదిక ప్రకారం అమెజాన్ ప్రైమ్ వంటి సౌకర్యం తోనే, flipkart కూడా తన విఐపి సబ్స్క్రిప్షన్ మోడల్ ను 499 రూపాయలకు ప్రకటించింది. ఇప్పుడు తాజాగా అమెజాన్ కూడా అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది.

దీని వల్ల కలిగే ప్రయోజనాలను 40 లక్షలకు పైగా ఉత్పత్తులపై ఒక రోజులో డెలివరీ, విక్రయాలకు ముందస్తు యాక్సెస్ చేయడానికి అలానే అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్లలో ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఉంది. ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, flipkart తో పోటీ పడుతూ కొనుగోలుదారులకు అనేక సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+