పులివెందుల ఎన్నిక వేళ కీలక పరిణామాలు..!!
పులివెందుల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జెడ్పీటీసీ ఎన్నిక రెండు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం అయింది. హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. దాడులు.. ఫిర్యాదుల తో ఈ ఎన్నిక పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. రెండు పార్టీల ప్రధాన నేతలు ఇక్కడ ఎన్నిక పైన ఫోకస్ చేసాయి. మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం కావటంతో ఇక్కడ గెలుపు కోసం టీడీపీ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసీపీ తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
పులివెందుల ఎన్నిక వేళ జరుగుతున్న ఘటనల పైన వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అరాచకానికి పాల్పడు తోందని అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రజల విశ్వాసానికి దూరం అవ్వడం వల్లే పోలీసుల సాయంతో ఉప ఎన్నికల్లో గెలిచి పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయా లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండాలను ఉసిగొల్పడం, పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి వైసీపీని నిలువరించాలని కలలు కంటున్నాడని ధ్వజమెత్తారు. ఏ ఎన్నిక జరిగినా ఏదో ఒక అక్రమాలు చేసి... ఎలాగైనా గెలచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు, తన పతనం ప్రారంభమవ్వలేదు అని నిరూపించుకోవాలన్న తాపత్రయంలో చంద్రబాబు ఇష్టా రాజ్యం గా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. పులివెందులలో ఇప్పుడు ఎన్నిక జరుగుతున్న జడ్పీటీసీ స్ధానం వైయస్సార్సీపీదేనని చెప్పుకొచ్చారు.

దురదృష్ఠవశాత్తూ ప్రమాదంలో ఆ జెడ్పీటీసీ మరణిస్తే ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇంకా 12 నెలలే మిగిలి ఉన్నా... ఈ ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టో, అధికార దుర్వి నియోగానికి పాల్పడో లేదంటే చివరికి బెదిరించైనా గెలవాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు పోలీస్ యంత్రాంగం సహకారంతో పూర్తిగా దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జగన్ నియోజకవర్గంలో మేం జెడ్పీటీసీని కైవసం చేసుకున్నామని చెప్పుకోవడానికి చంద్రబాబు అత్యంత నీచానికి దిగజారుతున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మా పార్టీ నాయకులు వేల్పులు రాముపై దాడి చేసి హత్యచేయడానికి ప్రయత్నించారన్నారు. కారు మీద పెట్రోల్ పోసి తగులబెట్టి భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారన్నారు. పోలీసులు పూర్తిగా చేతులెత్తేసి.. వైసీపీ నేతల మీద జరిగిన దాడిని సినిమా చూసినట్లు చూస్తున్నారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications