వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమా ప్లాప్: అంబటి, బాలకృష్ణ ఏం చేశారని ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబు వంద రోజుల పాలన ఫెయిలైన సినిమాగా అభివర్ణించారు. బాబు వంద రోజుల సినిమా ప్లాపయినా హిట్ అయిందని సంబరాలు జరుపుకోవడం ఆశ్చర్యకరమని ఎద్దేవా చేశారు.

పోలవరం ప్రాజెక్టు ఘనతను చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొన్నిచోట్ల బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతే విద్యుత్ వెలుగులు అంటూ బాబు గొప్పలకు పోతున్నారన్నారు. విజయవాడ రాజధానిగా అందరికీ సమ్మతమేనని అయితే, చర్చ లేకుండా ప్రకటన చేయడమే సరికాదన్నారు.

చంద్రబాబు తాను ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. వంద రోజులైనా రుణమాఫీపై సంతకం పెట్టలేదన్నారు. చంద్రబాబు రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాబు 200 వాగ్దానాలు చేశారని, పాదయాత్రలో మరో మూడు వందల వాగ్దానాలు చేశారని అన్నారు.

ఎన్టీఆర్ సుజల స్రవంతి ఎక్కడైనా అమలయిందా అన్నారు. రూ.2కే మినరల్ వాటర్ ఎవరైనా ఇప్పటిదాకా తాగారా చెప్పాలన్నారు. బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పిన బాబు.. మద్యం అమ్మకాలు ఎక్కడైనా తగ్గాయా చెప్పాలన్నారు. పదవీ విరమణ వయస్సును ఎవరికి పెంచారో చెప్పాలన్నారు. బాబు పరిపాలన అధ్వాన్నంగా ఉందే తెప్ప, ఏమాత్రం మెచ్చుకోలుగా లేదన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, అభిమానుల పైన దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

బాలకృష్ణ ఏం చేశారు: వైయస్సార్ కాంగ్రెస్

వంద రోజుల్లో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఏం సాధించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హిందూపురం సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ప్రశ్నించారు. మూడు ప్రారంభోత్సవాలు, 9 భూమి పూజలు, తొమ్మిది చెట్లు నాటడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. హిందూపురం నియోజకవర్గాలకు ఏం సేవ చేశారో చెప్పాలన్నారు.

English summary
YSR Congress Party leader Ambati Rambabu lashes out at Babu 100days rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X