నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి కలే..!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై రాజకీయంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న వేళ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు భారీ బాంబు పేల్చారు. నారా లోకేశ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై వస్తున్న వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నారా లోకేశ్‌కు భారీ షాకిచ్చారని తెలిపారు. నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేసే అంశంపై అమిత్ షా అంగీకరించలేదని.. ఈ సమాచారం తమకు ఉందని అంబటి రాంబాబు ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపింది.
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన వేళ ఆదివారం మీడియాతో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'గతంలో అమిత్ షా తిరుమలకు వస్తే చంద్రబాబు తన మనుషులతో రాళ్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు ఘన స్వాగతం పలుకుతున్నాడు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనేది చంద్రబాబుకు తెలిసిన విద్య' అని అంబటి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తోందని.. చంద్రబాబు ఏదేదో మాట్లాడుతూ అందరి బుర్ర పాడు చేస్తున్నాడని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే నారా లోకేశ్ డిప్యూటీ సీఎం అవుతారనే వార్తలపై అంబటి రాంబాబు స్పందిస్తూ.. 'అమిత్ షా చెప్పడం వల్లే గతంలో పవన్ కల్యాణ్‌ను ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటే అమిత్ షా అంగీకరించలేదని సమాచారం మా వద్ద ఉంది' అని ప్రకటించారు. ఇదే క్రమంలో ఏపీ పర్యటనలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను అంబటి తప్పుబట్టారు. 'ఏపీలో ఎన్నో సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ నుంచి రావాల్సిన రూ.8 వేల కోట్ల బకాయిలు, కృష్ణా జలాల సమస్యలు ఉన్నాయి. వీటిని అమిత్ షా ఎందుకు ప్రస్తావిచలేదు' అని నిలదీశారు. 'ప్రకృతి విపత్తులు సంభవిస్తే ఎన్డీఆర్‌ఎఫ్, మానవ విపత్తులు జరిగితే ఎన్డీయే వస్తుందని అమిత్ షా అంటున్నారు. మరి తిరుపతి తొక్కిసలాటకు ఎందుకు రాలేదు' అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఇల్లు ఓ అక్రమ కట్టడం
'అమిత్ షా జగన్ ప్యాలెస్‌ల గురించి అడిగారని చెబుతున్నారు. కానీ అసలు అమిత్ షా బస చేసిన చంద్రబాబు ఇల్లు ఓ అక్రమ కట్టడం అని.. దాని గురించి అమిత షాకు చెప్పాల్సింది కదా' అని టీడీపీ నాయకులకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఏ లెక్కన ఇచ్చారో కార్మికులకు కూడా అర్థం కావడం లేదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications