పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై మంత్రి అంబటి రాంబాబు ఎంత మాటన్నాడు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తూ ప్రజా క్షేత్రంలో దూసుకుపోతుంటే, మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఇంకోవైపు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించి ప్రజలలోకి వెళుతూ ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా ఎవరికి వారు వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని, అధికారం కట్టబెట్టాలని, తనకు ముఖ్యమంత్రి గా ఛాన్స్ ఇవ్వాలంటూ పవన్ కళ్యాణ్ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఆంధ్ర బాగుపడాలంటే ఒక అవకాశం జనసేన కు ఇవ్వాలని సీఎం స్థానాన్ని ఇస్తే ఆంధ్ర ప్రదేశ్ ను దేశంలోనే ఉన్నత స్థానంలో తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేపథ్యంలో ఆయనను టార్గెట్ చేస్తున్న వైసీపీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మరోమారు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. మొన్నటికి మొన్న చెగువేరా జన్మదినం సందర్భంగా ఒక ప్రశ్న అంటూ టీ షర్ట్ మీద చేగువేర.. గుండెల్లో చంద్రబాబు.. ఎవరతను? అని పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు.
ప్రస్తుతం చెప్పులు పోయాయంట.. నాలుగురోజులు వెతుక్కుని తిరిగి షూటింగ్ కు పోతాడులే.. పట్టించుకోకండి అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర లైట్ తీసుకోమంటూ అంబటి రాంబాబు తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. చెప్పులు పోతే పవన్ కళ్యాణ్ వెతుక్కుంటున్నాడని ఎద్దేవా చేశాడు. పవన్ కళ్యాణ్ మాటలకు ప్రాధాన్యత లేదని, నాలుగురోజులు తిరిగి మళ్లీ షూటింగ్ కి వెళ్ళి పోతాడు అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ మనస్సు ఒక్కో పర్యటనకు ఒక్కో రకంగా మారుతుందని పేర్కొన్న అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకు పనికిరాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని జనసేన పార్టీలో ఉన్న నేతల, జనసైనికుల పరిస్థితి కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఉందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ ను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడని, చంద్రబాబు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటూ విమర్శించారు.












Click it and Unblock the Notifications