అమిత్ షా - జూ ఎన్టీఆర్ భేటీ వెనుక - కీలక పాత్ర ఆయనదే : పక్కా ప్లాన్..!!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. స్వయంగా అమిత్ షా నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందింది. ఇద్దరూ దాదాపు అరగంట సేపు ఏకాంతంగా సమావేశం అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు మెచ్చి..అభినందించేందుకే ఆహ్వానించారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే, అమిత్ షా హైదరాబాద్ కు వచ్చే ముందే ఆయన కార్యాలయం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు ఈ సమావేశంకు సంబంధించి ఆహ్వానం అందింది.
Recommended Video

మీటింగ్ వెనుక ఆ ప్రముఖ వ్యక్తి
దానికి ముందే ఈ సమావేశానికి సంబంధించి కసరత్తు జరిగింది. జూనియర్ ను ఆహ్వానించిన కాదనకుండా వచ్చేలా..ఒక ప్రముఖ వ్యక్తి రంగంలోకి దిగారు. జూనియర్ ఎన్టీఆర్ కు వ్యక్తిగతంగా.. దర్శకుడిగా అత్యంత ఆప్తుడు అయిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ద్వారా బీజేపీ నేతలు ఈ సమావేశానికి జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించినట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా.. విజయేంద్ర ప్రసాద్ ను బీజేపీ రాజ్యసభకు ఎంపిక చేసింది. ఆయన ద్వారా.. జూనియర్ ఎన్టీఆర్ ఈ సమావేశానికి వచ్చేలా ఒప్పించారని తెలుస్తోంది. అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగిన ఏకాంత చర్చల్లో సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు..ఆయన పాలనా పరమైన నిర్ణయాలతో పాటుగా తాజా రాజకీయాల పైన చర్చ జరిగినట్లుగా విశ్వసనీయ సమాచారం.

ఇద్దరి మధ్య ఏకాంత భేటీలో
అమిత్ షా తో తాను భవిష్యత్ లో చేపట్టబోయే సినిమా ప్రాజెక్టుల గురించి వివరించారు. జూనియర్ ఎన్టీఆర్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. దీనిని భవిష్యత్ రాజకీయాల్లో తమకు అనకూలంగా మలచుకొనేందుకే అమిత్ షా ఇప్పుడు ఆకస్మికంగా జూనియర్ తో భేటీ అయినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరో ఏడాది కాలంలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనేది బీజేపీ లక్ష్యం. అందులో భాగంగా.. కొన్ని ప్రత్యేక లక్ష్యాలతో జూనియర్ తో హైదరాబాద్ కేంద్రంగా అమిత్ షా ఈ ఆకస్మిక భేటీకి ప్లాన్ చేసారనే వాదన ఉంది.

ఎన్టీఆర్ పొలిటికల్ గా ఆసక్తితో ఉన్నారా
కానీ, రాజకీయంగా అమిత్ షా ఎటువంటి ప్రణాళిలకతో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అయినా.. జూనియర్ మాత్రం రాజకీయాల్లో ఇప్పట్లో యాక్టివ్ అయ్యే అవకాశం కనిపించటం లేదు. అదే సమయంలో టీడీపీకి నష్టం చేసే వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకొనే అవకాశం ఉండదని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన సినిమాలను వదిలి.. రాజకీయాల్లోకి అందునా బీజేపికి అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు లేవనది సుస్పష్టం. 2009లో టీడీపీ కోసం ప్రచారం చేసిన ఎన్టీఆర్..ఆ తరువాత టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications