Pawan Kalyan-Amit Shah : పవన్ కు అమిత్ షా ఇచ్చిన హామీ ఇదే ?
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్దమవుతున్న రాజకీయ పార్టీలకు టీడీపీ-జనసేన పొత్తు కంటే బీజేపీ వీరితో కలిసొస్తుందా లేదా అన్న మీమాంస వెంటాడుతోంది. ఎందుకంటే బీజేపీ సాయం లేకుండా గతంలో టీడీపీ నష్టపోయిన ఉదాహరణ వాళ్లకు కళ్లముందే మెదులుతోంది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో దీనిపై కాస్త క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. ఢిల్లీ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్న వారు చెబుతున్న వివరాల ప్రకారం ఈ భేటీలో పవన్-షా మధ్య ఓ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికల్లు సీట్ల పంపకాలు, పొత్తు, మద్దతుపై చర్చించేందుకు బీజేపీ ఆహ్వానం మేరకు నిన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఒకే ఫ్లైట్ లో ఢిల్లీకి హడావిడిగా బయలుదేరి వెళ్లిన పవన్.. సాయంత్రం ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన చర్చలో తెలంగాణ ఎన్నికలపై ముందుగా చర్చ జరిగింది. ఇందులో పవన్ కు అమిత్ షా ముందుగా తెలంగాణ ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది. అసలే తెలంగాణలో పరిస్ధితులు ప్రతికూలంగా మారుతున్న వేళ పవన్ కళ్యాణ్ మద్దతిస్తే కాస్తో కూస్తో ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ - అమిత్ షా మధ్య ఏపీ గురించి ప్రస్తావన రాలేదన్న వార్తలు వచ్చినా ఫైనల్ గా మాత్రం ఓ సంకేతం మాత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందు తెలంగాణ ఎన్నికల్లో సహకరించండి.. ఆ తర్వాత ఏపీలో చూద్దామంటూ అమిత్ షా పవన్ కళ్యాణ్ కు ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో పవన్ కూడా సరేనన్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇవాళ తెలంగాణలో సీట్ల ఖరారుకు బీజేపీ-జనసేన పార్టీల నేతలు సమావేశం అవుతున్నారు.
ఏపీలో ఓవైపు బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ చంద్రబాబు అరెస్టు తర్వాత జైలుకెళ్లి పరామర్శించి అక్కడే టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్.. బీజేపీ ఎలాగైనా తమతో కలిసివస్తుందనే ధీమాలో ఉన్నారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ తమ నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో నిన్నటి చర్చల తర్వాత ప్రస్తుతానికి ఏమీ మాట్లాడకుండా మరో నెల రోజుల్లో తెలంగాణ ఎన్నికలు ముగిశాక పవన్ దీనిపై స్పందించే అవకాశం ఉందని చెప్తున్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications