రూ.లక్షకు రూ.10 లక్షల లాభం.. అమితాబ్ బచ్చన్ మల్టీబ్యాగర్ స్టాక్
స్టాక్ మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ఎన్నో పరిస్థితులను బట్టి మార్కెట్లు ప్రభావితమవుతుంటాయి. రాజకీయంగా సంభవించే పరిణామాలు, కంపెనీల ప్రకటనలు, భౌగోళిక ఉద్రిక్తతలతోపాటు భారీ పెట్టుబడులు, ఒప్పందాలు.. ఇలాంటివన్నీ కీలకంగా వ్యవహరిస్తుంటాయి. మార్కెట్ లో మంచి లాభాలు రావాలంటే వాటిపై పట్టుండటంతోపాటు నిపుణుల సలహా తీసుకుంటుండాలి. ఒక క్రమపద్ధతిలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి.
కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ ఉన్నాయి. కొద్దినెలల్లోనే షేరు విలును పెంచుతాయి. అలా పెట్టుబడిదారుల సంపదను పెంచిన మల్టీబ్యాగర్ స్టాక్ గురించి తెలుసుకుందాం.డీ పీ వైర్స్ లిమిటెడ్ (D P Wires Limited). ఇది స్టీల్ వైర్ తోపాటు ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని తయారు చేస్తుంటుంది. జియోమెంబ్రేన్ షీట్లు, పీఈ కోటెడ్ అండ్ గ్రీస్డ్ స్ట్రాండ్స్, LRPC స్ట్రాండ్స్, స్టీల్ వైర్స్, ఇతర ప్లాస్టిక్ ఫర్మ్ షీట్లు ఉంటాయి. 2017లో ఈ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ అయ్యింది. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ భారీమొత్తంలో పెట్టుబడి పెట్టారు. మధ్యప్రదేశ్ లోని రత్లాంలో తయారీ కేంద్రం ఉంది. సంవత్సరానికి 60 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది.

DP వైర్స్ లిమిటెడ్ షేరు ధర ప్రస్తుతం రూ. 530 లెవెల్స్‌లో ట్రేడవుతోంది. 5 రోజుల్లో దాదాపు 15 శాతం పుంజుకుంది. నెల వ్యవధిలో 24 శాతానికిపైగా పెరిగింది. ఏడాదిలో 86 శాతం రిటర్న్స్ ఇచ్చింది. మూడు సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే 897 శాతం రిటర్న్స్ ఇవ్వడం విశేషం. మూడేళ్ల కిందట రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారి సంపద ఇప్పుడు రూ.10 లక్షలు అయింది. రూ.9 లక్షల లాభం. కంపెనీ ROE, ROCE వరుసగా 23.9 శాతం, 32 శాతంగా నమోదయ్యాయి. కంపెనీ నికర లాభం 114 శాతం వృద్ధి చెంది రూ.15 కోట్లుగా ఉంది. నాలుగో త్రైమాసికంలో సేల్స్ 117 శాతం పెరిగి రూ. 387 కోట్లుగా నమోదైంది. ఈ స్టాక్ ను వాచ్ లిస్టులో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications