వైయస్ జగన్‌తో ఆదాల డీల్: ఆనం వివేకా (ఫోటోలు)

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ పార్టీ నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో డీల్ కుదుర్చుకున్నారని కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి ఆరోపించారు. జగన్‌తో 55 కోట్ల రూపాయలకు ఆదాల డీల్ కుదుర్చుకున్నట్లు ఆయన ఆరోపించారు. అందుకే ఆదాల రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

కుదిరిన ఒప్పందం మేరకు ఆదాల ప్రభాకర్ రెడ్డిని తమ పార్టీ అధికారిక అభ్యర్థిగా వైయస్ జగన్ తన పార్టీ ప్లీనరీలో ప్రకటించబోతున్నారని ఆయన అన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి తన సమీప బంధువు ద్వారా వైయస్ జగన్‌తో రాయబారం నడిపారని ఆయన అన్నారు. ఆ సమీప బంధువు ఎవరనే విషయం వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ద్వారా రాయబారం నడిపారా అని అడిగితే కాదని చెప్పారు. శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ద్వారా నడిపారా అని ప్రశ్నిస్తే, జెసి కుటుంబం కాంగ్రెసు పార్టీకి చెందిందని, జెసిపై అభాండాలు వేయడం సరి కాదని వివేకానంద రెడ్డి అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ట్రిపుల్ ధమాకా నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఓక్కసారి కూడా సమైక్యవాదం వినిపించనివారు రాజ్యసభ ఎన్నికల్లో సమైక్యవాద నినాదంతో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, సమైక్యవాదమని చెప్తే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు అధికారిక అభ్యర్థులకే ఓటు వేస్తారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసును దొంగల పార్టీగా చెప్పిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన అన్నారు. రాజకీయ వ్యవస్థ పూర్తిగా కుళ్లిపోయిందని ఆయన అన్నారు.

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ఆనం వివేకానంద రెడ్డి తనదైన శైలిలో ధ్వజమెత్తారు.

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాలపై విమర్శలు, తీవ్ర వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆనం వివేకానంద రెడ్డి తనదైన శైలిలో పలు విన్యాసాలు చేశారు.

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ఆనం వివేకానంద రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ తన హావభావాలను వివిధ రీతుల్లో ప్రదర్శించారు.

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాలపై విమర్శలు చేసిన సమయంలో మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆనం వివేకానంద రెడ్డి తనదైన శైలిలో యాక్షన్ చేశారు.

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాలపై ఆనం వివేకానంద రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఇలా చేయి ఎక్కుపెట్టి, చూపుడు వేలితో ఇలా చూపించారు.

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాల ప్రభాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మద్దతు కోసం రాయబారాలు నడుపుతున్నారని విమర్శిస్తూ ఇలా ..

ఆదాలపై ఆనం వివేకా ఇలా...

ఆదాలపై ఆనం వివేకా ఇలా...

టీవీ చానెళ్ల కెమెరాల ముందు ఆనం వివేకానంద రెడ్డి రెడీ, యాక్షన్ అన్నట్లుగా ఫోజు పెట్టి ఆదాలపై విరుచుకుపడ్డారు.

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆనం వివేకానంద రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు చేసిన సమయంలో నాటకంలా ప్రదర్శన ఇచ్చి చూపారు.

ఆదాలపై ఆనం వివేకా ఇలా...

ఆదాలపై ఆనం వివేకా ఇలా...

ఆదాల ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఆనం వివేకానంద రెడ్డి ఇలా నటించి డైలాగులు విసిరారు. ఆద్యంతం ఆసక్తికరమైన డ్రామాలా నడిచింది.

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాల ప్రభాకర్ రెడ్డిపై విరుచుకుపడుతూ ఆనం వివేకానంద రెడ్డి తన నటనా కౌశల్యాన్ని, హావప్రదర్శన నైపుణ్యాన్ని చూపించారు.

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆదాలపై ఆనం వివేకా ఇలా..

ఆనం వివేకానంద రెడ్డి డ్రామాను తిలకిస్తూ ఆనందిస్తున్నట్లు కాంగ్రెసు తిరుగుబాటు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఇలా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+