చాలా ఆడా: హిజ్రాలతో ఆనం హల్‌చల్, ఎంపి పైకి బాటిల్
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, శాసన సభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి ఎప్పుడు తన చేష్టలతో వార్తల్లో నానుతుంటారు. గురువారం నెల్లూరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెబుతుండగా అక్కడకు హిజ్రాలు వచ్చారు.
ఈ సమయంలో ఆనం వారితో కాసేపు మాట్లాడారు. తమతో ఆడాలని హిజ్రాలు ఆనంను కోరారు. అందుకు ఆనం స్పందిస్తూ.. తాను చాలా ఆడాను లెండీ అంటూ వారిని అక్కడి నుండి పంపించారు. వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ కాసేపు హల్ చల్ చేశారు. కాగా, ఆనం వివేకా ఇటీవల రచ్చబండ కార్యక్రమంలో సిగరేట్ తాగిన విషయం తెలిసిందే.

చింతామోహన్ పై వాటర్ బాటిల్
పలు జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమం ఉద్రిక్తంగా మారుతున్న విషయం తెలిసిందే. గురువారం తిరుపతి పార్లమెంటు సభ్యులు చింతా మోహన్ రచ్చబండలో పాల్గొన్నారు. ఈ సమయంలో పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఆయన పైకి వాటర్ బాటిల్ విసిరేశారు. దీంతో రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది.
కాగా, ఖమ్మం జిల్లా కొత్తగూడెం రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెసు, సిపిఐ కార్యకర్తలు కొట్టుకొని, పరస్పరం కుర్చీలు విసురుకున్న విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఆందోళన చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications