తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ ముందు తోక తిప్పితే ఇలాగే ఉంటుంది, పాపం లాయర్ పరిస్థితి ?
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ గురించి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరంలేదు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి తాడిపత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశంలో చేరిన జేసీ సోదరులు తరువాత కూడా వారి హవా కొనసాగించారు. అయితే వైసీపీ దెబ్బతో కొంతకాలం పాటు జేసీ బ్రదర్స్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాడిపత్రిలో మరోసారి తెలుగుదేశం జెండా ఎగరవేసిన జేసీ కుుటంబ సభ్యులు మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు తాడిపత్రిలో జేపీ అనుచరులు ధైర్యంగా తిరుగుతున్నారు.

గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనతో తమ ముందే తోక తిప్పిన కొందరు వైసీపీ నాయకులు, వైసీపీ సానుభూతిపరులతో పాటు పాటు కొంత మంది వ్యాపారుల మీద జేసీ బ్రదర్స్ కన్ను వేశారు. గతంలో జేసీ బ్రదర్స్ కేసులతో పాటు వారి కార్యకలాపాలు చక్కబెట్టిన ప్రముఖ న్యాయవాది శ్రీనివాసులు తరువాత తిన్నింటి వాసాలు లెక్కపెట్టి ఆయన చేతివాటం చూపించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రిలో జేసీ కుటుంబ సభ్యులు ఓడిపోవడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అంతవరకు టీడీపీలో జేపీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండే లాయర్ శ్రీనివాసులు పార్టీ మార్చేశారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి దగ్గరకు వెళ్లి ఆయన సమక్షంలో వైసీపీలో చేరిన లాయర్ శ్రీనివాసులు తరువాత బహిరంగంగా జేసీ బ్రదర్స్ తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు జేసీ ఫ్యామిలీతో పాటు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని, తనతో పాటు వైసీపీ నాయకుల జోలికి వస్తే ఈ భూమిమీద ఎవ్వడూ ప్రాణాలతో ఉండడని, నా గురించి జేసీ ఫ్యామిలీకి బాగా తెలుసు అని బహిరంగంగా మీడియా ముందు లాయర్ శ్రీనివాసులు నోరుపారేసుకున్నారు. ఇలా జేసీ ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చారు.

2024లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాడిపత్రిలో జరిగిన గొడవలకు లాయర్ శ్రీనివాసులకు సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రిలో టీడీపీ నుంచి పోటీ చేసిన జేసీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కావడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం కావడంతో జేసీ బ్రదర్స్ హవా మళ్లీ మొదలైయ్యింది. ఈ దెబ్బతో లాయర్ శ్రీనివాసులకు దడ మొదలైయ్యింది.
తాడిపత్రిలోని జేసీ ఇంటికి వెళ్లిన లాయర్ శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అయ్యా తప్పు జరిగిపోయింది, నన్ను మళ్లీ టీడీపీలో చేర్చుకోండి అంటూ ప్రాధేయపడ్డాడు. తాడిపత్రిలో ప్రజలు అందరి ముందు మమ్మల్ని నానా మాటలు మాట్లాడావని, టీడీపీ కార్యకర్తలను దూషించావని, నిన్ను టీడీపీలో చేర్చుకునే ప్రసక్తేలేదని, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగానే లాయర్ శ్రీనివాసులకు చెప్పారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి బయటకు వెళ్లిపోవాలని చెప్పినా లాయర్ శ్రీనివాసులు మాత్రం ఆయన ముందు చేతులు జోడిచి నమస్కారం చేస్తూ తాను మీ వెంటే ఉంటానని, గతంలో తాను చేసిన తప్పులను పెద్దమనసుతో మర్నించాలని పదేపదే ప్రాదేయపడ్డాడు. సహనం కోల్పోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులను పిలిచి రేయ్ వీడిని ఎత్తి బయటపడేయండి అని చెప్పారు. జేసీ అనుచరులు లాయర్ శ్రీనివాసులను భుజాల మీద ఎత్తుకుని వెళ్లి జేసీ ఇంటి గేటు బయటకు విసిరేశారు.
జేసీ కుటుంబ సభ్యులతో మంచిగా ఉంటే ఆ మర్యాదేవేరు అని, వారితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. జేసీ కుటుంబ సభ్యులతో పెట్టుకుని నేడు ఎటూ కాకుండా పోయిన లాయర్ శ్రీనివాసులు పరిస్థితి అయోమయంగా మారిందని తెలిసింది. మమ్మల్ని నానా మాటలు మాట్లాడిన లాయర్ శ్రీనివాసులను టీడీపీలో చేర్చుకునే ప్రసక్తేలేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చిచెప్పారు. మొత్తం మీద తాడిపత్రిలో రసవత్తర రాజకీయాలు మళ్లీ మొదలు కావడంతో ఇంతకాలం జేసీ ఫ్యామిలీతో పెట్టుకున్న వారికి ఆట మొదలైయ్యిందని తెలిసింది.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications