ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు వేళాయె..: ఈ టర్మ్‌లో ఇదే చివరిది

AP Assembly budget session 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఇంకో రెండు నెలల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీతో పాటు 25 లోక్‌సభ స్థానాలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

సార్వత్రిక పోరు నిర్వహణపై ఇప్పటికే కేంద్ర కమిషన్ కసరత్తు చేపట్టింది కూడా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ఇతర అధికార యంత్రాంగంపై సమావేశాలను నిర్వహించింది. ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష చేపట్టింది. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల గురించి ఆరా తీసింది.

Andhra Assembly to commence from January 31 or Feb 1

ఈ పరిస్థితుల మధ్య- ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతోన్నాయి. ఈ నెల చివరివారం లేదా ఫిబ్రవరి మొదటివారంలో ఏపీ అసెంబ్లీ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ఏడాది కావడం వల్ల జగన్ ప్రభుత్వం.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తారు. మొత్తం అయిదు రోజుల పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనిపై బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటారు.

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడం వల్ల పరిమితంగా కేటాయింపులు ఉంటాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆ శాఖలకు బడ్జెట్‌ను కేటాయిస్తారు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో 96 శాతం మేర అమలు చేశామని చెబుతోంది వైఎస్ఆర్సీపీ. నవరత్నాలతో పాటు అందులో ఇవ్వని హామీలను సైతం అమలు చేశామనే ధీమాతో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+