అప్పులకెళ్లిన ఏపీ ప్రభుత్వం- ఈ సారి?
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రుణాలపై ఎక్కువగా ఆధారపడింది.
అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగట్టుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా- ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లు/స్టాక్స్‌ను వేలానికి పెట్టే సంప్రదాయాన్ని అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కొనసాగిస్తోంది.

ఇప్పటికే దశలవారీగా వేల కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అప్పులకు వెళ్లింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్. తాజాగా 5,750 కోట్ల రూపాయలను సమీకరించుకోనుంది. దీనికి అవసరమైన అయిదు స్టాక్స్‌ను రిజర్వ్ బ్యాంక్ వద్ద వేలానికి పెట్టింది.
ఇందులో ఒక స్టాక్ విలువ 1,400 కోట్ల రూపాయలు. మరొకటి 1,350 కోట్ల రూపాయల విలువ చేసేది. మిగిలిన మూడు స్టాక్స్ విలువ ఒక్కొక్కటి 1,000 కోట్ల రూపాయలు. ఈ నెల 3వ తేదీన అంటే గురువారం నాడు ఈ స్టాక్స్ వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఇ-కుబేర్) ద్వారా వేలం పాట సాగుతుంది.
కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది. ఈ స్టాక్స్ కాల వ్యవధి ఒకటి- 16, మరొకటి- 15, మిగిలిన మూడింటివి- 8, 9, 12 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు.
కాంపిటీటివ్ విధానంలో ఈ అయిదు స్టాక్స్‌ను కొనదలిచిన వారు గురువారం ఉదయం 10:30 నుంచి 11:30 గంటలు, నాన్ కాంపిటీటివ్ విధానంలో వాటిని కొనదలిచిన వారు అదే తేదీన ఉదయం 10: 30 నుంచి 11 గంటల మధ్య తమ బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.
ఏపీతో పాటు మరి కొన్ని రాష్ట్రాలు తమ స్టాక్స్‌ను రిజర్వ్ బ్యాంక్ వద్ద వేలానికి పెట్టాయి. హిమాచల్ ప్రదేశ్- రూ. 900 కోట్లు, జమ్మూ కాశ్మీర్- రూ. 500 కోట్లు, మేఘాలయా- రూ. 350 కోట్లు, పంజాబ్- రూ. 3,300 కోట్లు, రాజస్థాన్- రూ. 1,000 కోట్ల రూపాయల మేర స్టాక్స్‌ను వేలానికి పెట్టాయి.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications