ఏపీ క్యాడర్ ఐపీఎస్‌ను ఏరికోరి ఎన్నుకున్న కేంద్రం: డేంజరస్ టాస్క్ అప్పగింత

Nalin Prabhat IPS: ఆర్టికల్ 370 రద్దు, ప్రత్యేక రాష్ట్ర హోదా తొలగింపు తరువాత కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కేంద్ర ఎన్నికల కమిషన్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది.

ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర, హర్యానాల్లో ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సారథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. మనోజ్ సిన్హా లెప్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తోన్నారు.

Andhra Pradesh cadre senior IPS officer Nalin Prabhat to appointment as the DGP of Jammu Kashmir

ఆయా రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకించి- జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అయిదు లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ రెండు చొప్పున సీట్లల్లో విజయం సాధించాయి. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. దీనితో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై దృష్టి సారించింది బీజేపీ.

అదే సమయంలో ఉగ్రవాదుల కదలికలు భారీగా ఉన్నందున ఈ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడానికీ ప్రాధాన్యత ఇస్తోంది. ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకుండా ఈ ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఆ రాష్ట్రం నుంచి ఉగ్రవాదులను సమూలంగా నిర్మూలించగలిగామనే సందేశాన్ని ఇవ్వాలనే పట్టుదలతో ఉంది.

ఈ క్రమంలో- ఏపీకి చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్‌ను జమ్మూ కాశ్మీర్ కొత్త పోలీస్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులు అయ్యారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రత్యేక డీజీపీగా ఆయన అపాయింట్ అయ్యారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు స్పెషల్ డీజీపీగా కొనసాగుతారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలను స్వీకరిస్తారు.

జమ్మూ కాశ్మీర్ డీజీపీగా నళిన్ ప్రభాత్‌ను అపాయింట్ చేయడం కోసం ఏకంగా ఆయన క్యాడర్‌నే మార్చివేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ క్యాడర్‌లో ఉన్న ఆయనను అరుణాచల్ ప్రదేశ్- గోవా- మిజోరం- యూనియన్ టెరిటరీ (ఏజీయూఎంటీ)కి బదిలీ చేసింది. ప్రస్తుతం నళిన్ ప్రభాత్.. కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+