ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారు: ఎప్పట్నుంచంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు టైం టేబుల్ విడుదలైంది. మే 24 నుంచి జూన్ 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ప్రథమ.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు తెలిపారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షా ఫలితాలను విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకేసారి ఫస్ట్ ఇయర్‌తో పాటు, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ పరీక్షల్లో 4 లక్షల 84వేల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, 5లక్షల 19వేల మంది విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరయ్యారు.

అయితే, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2,66,322 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ విషయానికొస్తే మొత్తం 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 65 శాతం, 58 బాలురు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్‌లో బాలికలు 75 శాతం మంది బాలికలు, 68 శాతం మంది బాలురు పాస్ అయ్యారు. మొత్తం మీద ఇంటర్ రిజల్ట్స్‌లో బాలికలదే పైచేయి. ఈ క్రమంలోనే సప్లిమెంటరీ పరీక్షలకు తేదీలను ఖరారు చేశారు. అడ్వాన్స్ సప్లిమెంటరీకి ఫీజు చెల్లించడానికి మే 3వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు:
మే 24న సెకండ్ లాంగ్వేజ్
25న ఇంగ్లీష్
26న మ్యాథ్స్-ఏ, బోటనీ, సివిక్స్
27న మ్యాథ్స్-బీ, జువాలజీ, హిస్టరీ
29న ఫిజిక్స్, ఎకనామిక్స్
30న కెమెస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్, లాజిక్ పేపర్
జూన్ 1న మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి.

-
రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్












Click it and Unblock the Notifications