ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ (సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్)

ఉద్యోగ రంగం : పోలీస్ ఉద్యోగం

ఉద్యోగ ప్రాంతం : ఆంధ్రప్రదేశ్

దరఖాస్తుకు చివరి తేదీ : 24 అక్టోబర్, 2016

ap

జాబ్ గురించి :

ఆంధ్రప్రదేశ్ లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ మేరకు పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 707 స్టయిఫండరీ క్యాడెట్ ట్రైనీ, సబ్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ జైలర్ మరియు అసిస్టెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

పోస్టు : సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ జైలర్

విద్యార్హతలు : డిగ్రీ

ఉద్యోగ ప్రాంతం : ఆంధ్రప్రదేశ్

జీత భత్యాలు : రూ.28940-78910/ఒక నెలకు

చివరి తేదీ : 24 అక్టోబర్, 2016

మొత్తం పోస్టులు : 707

స్టయిఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్.సీ.టీ) సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ : 686 పోస్టులు

వయసు పరిమితి : దరఖాస్తుదారుని వయసు 21 సంవత్సరాల కన్నా తక్కువగా ఉండకూడదు. అలాగే 27 సంవత్సరాలకు పైబడి ఉండకూడదు. జూలై 01, 2016 తేదీని అనుసరించి వయసును పరిగణలోకి తీసుకుంటారు.

జీత భత్యాలు : రూ.28940-78910/ఒక నెలకు

విద్యార్హతలు : దేశంలోని ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. దరఖాస్తుదారులు ఎస్సీ, ఎస్టీలు అయితే జూలై 01,2016 నాటికి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.

డిప్యూటీ జైలర్ పోస్టులు : 16

వయసు పరిమితి : దరఖాస్తుదారుని వయసు 21 సంవత్సరాల కన్నా తక్కువగా ఉండకూడదు. అలాగే 27 సంవత్సరాలకు పైబడి ఉండకూడదు. జూలై 01, 2016 తేదీని అనుసరించి వయసును పరిగణలోకి తీసుకుంటారు.

పే స్కేలు : రూ.26600-రూ.77030/ఒక నెలకు

విద్యార్హతలు : దేశంలోని ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. దరఖాస్తుదారులు ఎస్సీ, ఎస్టీలు అయితే జూలై 01,2016 నాటికి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు రుసుం : ఓబీసీలకు రూ.600/, ఎస్సీ, ఎస్టీలకు రూ.300/- మీసేవా కేంద్రాలు, ఏపీ ఆన్ లైన్, టీఎస్ ఆన్ లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి : రాష్ట్ర పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వెబ్ సైట్ appolice.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 23వ తేదీన మొదలయ్యే దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 24తో ముగుస్తుంది.

రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+