ఏపీలో NHAI నాలుగు గిన్నిస్ రికార్డులు.. గడ్కరీ ప్రశంసలు
ఏపీలో జాతీయ రహదారి నిర్మాణ పనులు గిన్నిస్ రికార్డుల్ని సాధించిన నేపథ్యంలో కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో గిన్నిస్ రికార్డుల్ని నెలకొల్పిన నేపథ్యంలో ప్రశంసించారు. కేవలం 6 రోజుల్లోనే 52 కిలోమీటర్ల (156 లేన్ కిలోమీటర్లు) మేర రహదారిని నిర్మించి ఈ ఘనత సాధించిన విషయం తెలిసిందే.
Setting new global benchmarks in highway engineering 🛣️, NHAI has created history by achieving two more Guinness World Records in continuous Bituminous Concrete paving.
— Nitin Gadkari (@nitin_gadkari) January 11, 2026
A record 156 lane-km of paving and 57,500 MT of Bituminous Concrete were laid continuously, surpassing the… pic.twitter.com/L1qP1R1f0B
బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ట్వీట్ చేశారు. జనవరి 5 నుంచి 11వ తేదీ వరకు డే అండ్ నైట్ నిరంతరం బిటుమినస్ కాంక్రీట్ వేయడంలో మరో రెండు గిన్నిస్ రికార్డులను సాధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) రికార్డు సృష్టించిందని తెలిపారు. హైవే ఇంజినీరింగ్ లో కొత్త బెంచ్ మార్క్ ను నెలకొల్పిందని ప్రశంసించారు. రికార్డు స్థాయిలో 156 లేన్ కిలోమీటర్లు నిర్మించి గతంలో ఉన్న 84.4 లేన్ కిలోమీటర్ల ప్రపంచరికార్డును అధిగమించారని గడ్కరీ కొనియాడారు. ఈ మేరకు రహదారి నిర్మాణంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది చేసుకుంటున్న సంబరాలకు సంబంధించిన వీడియోను గడ్కరీ పోస్టు చేశారు.

ఇక సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని వానవోలు- వంకరకుంట- ఓదులపల్లె సెక్షన్ లోని ప్యాకేజీ -2, 3 పనుల్లో ఈ రికార్డులు నమోదయ్యాయి. ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు నిరంతరాయంగా పనులు జరిగాయి. నిర్మాణంలో భాగంగా 57,500 మెట్రిక్ టన్నుల కాంక్రీటును వేయడం, అత్యంత వేగంగా పేవింగ్ పూర్తి చేయడం ద్వారా రెండు విభాగాల్లో గిన్నిస్ రికార్డులు వచ్చాయి.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications