కోడి పందాలపై ఏపీ హైకోర్టు బిగ్ షాక్- బరుల వద్ద 144 సెక్షన్

ఇంకో రెండు రోజుల్లో తెలుగు లోగిళ్లల్లో సంక్రాంతి పండగ సందడి నెలకొనబోతోంది. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమౌతోన్నాయి. ఇంటి ముందు రంగవల్లులు, కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో పండగ కోలాహలం ఏర్పడనుంది. తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండుగ. కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో ఈ పండగను జరుపుకోవడానికి స్వస్థలాలకు తరలి వెళ్లడం ఆనవాయితీ.

కోస్తా జిల్లాల్లో సంక్రాంతి పండగకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కోడి పందేల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాహకులకు బిగ్ షాక్ ఇచ్చింది. జూదం, జంతుహింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆయా జిల్లా అధికార, పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించింది. కోడి పందేలు, పేకాట, ఇతర జూదం తరహా కార్యకలాపాలను అడ్డుకోవాలని సూచించింది. అవసరమైతే 144 సెక్షన్‌ అమలు చేయాలని స్పష్టం చేసింది.

Andhra Pradessh High Court Sets Ground Rules for Cockfight Proceedings

జంతు హింస నిరోధక చట్టం 1960, జూదం నిరోధక చట్టం- 1974 ను కఠినంగా అమలు చేయాలని తెలిపింది. దీనికోసం ఆయా జిల్లాల్లోని అన్ని మండలాల్లో ప్రత్యేకంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, దీనికోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సమయంలో హైకోర్టు ఈ తరహా ఆదేశాలు ఇస్తూ వస్తోన్నప్పటికీ అవి అంత సులువుగా అమలు కావట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రతి సంక్రాంతికీ జోరుగా సాగే ఈ కోడిపందేలను తిలకించడానికి పొరుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఎన్నారైలు కూడా ఈ పోటీలను చూడటానికి, ఇందులో పాల్గొనడానికి తమ తమ స్వగ్రామాలకు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నాలుగు రోజుల్లో కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరుగుతాయక్కడ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+