ఏపీలో ఆగని అంగన్వాడీల ఆందోళన.. కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం!!

తమ సమస్యల పరిష్కారం కోసం గత 23 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్ వాడీలు జగన్ సర్కార్ విధులకు హాజరు కావాలని హుకుం జారీ చేసినప్పటికీ నేడు ఉధృతంగా ఆందోళనల బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వటంతో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కొనసాగుతుంది.

నేడు తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలలో అంగన్వాడీలు కలెక్టరేట్ ల ముట్టడి చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ల వద్ద బైఠాయించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో తరలి వచ్చి జిల్లాల కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించారు.

Anganwadis protest intensified in AP.. tension in the siege of Collectorates!!

సమ్మెలో భాగంగా రాష్ట్రవ్యాప్త పిలుపుకు స్పందనగా ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించినట్టు అంగన్వాడీ సంఘాల నాయకులు తెలిపారు.పోలీసులు అంగన్వాడీలను అడ్డుకునే ప్రయత్నం చెయ్యటంతో ఒక దశలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు తరలివచ్చారు.

అంగన్వాడీల కలెక్టరేట్ల ముట్టడితో చాలా చోట్ల కలెక్టర్ కార్యాలయానికి వచ్చే రహదారులు అంగన్ వాడీ కార్యకర్తలతో నిండిపోయాయి. అంగన్ వాడీల కలెక్టరేట్ ముట్టడి పిలుపులో పోలీసు శాఖ అప్రమత్తమై కలెక్టర్ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులను మోహరించారు.

ఈ సందర్బంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 23 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అంతేకాక, తమ డిమాండ్లను నెరవేర్చినట్టు మంత్రుల సంఘం ప్రకటన విడుదల చేయడం అన్యాయమన్నారు. అంగన్ వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

రానున్న ఎన్నికల్లో అంగన్వాడీల సమ్మె అంశం ఎజెండాగా మారే అవకాశం ఉందన్నారు.ప్రభుత్వ బెదిరింపు చర్యలకు భయపడేది లేదన్నారు. తక్షణం జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, వేతన పెంపు చెయ్యాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+