ఆనం టీడీపీలో ఉండరు, లోకేశ్ కు మాజీ మంత్రి అనిల్ సవాల్..!!

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. నారా లోకేశ్..ఆనం రామనారాయణ రెడ్డి పైన ఫైర్ అయ్యారు. ఆనం ఎక్కడా చేసిన గెలవరని చెప్పుకొచ్చారు. ఆనం టీడీపీని వదిలేస్తారని చెప్పారు.ఈ సారి ఎన్నిల్లో నారాయణ కుమార్తె టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో వైసీపీలో కలుపు మొక్కలుగా ఉన్న ముగ్గురిని పీకి పారేసారని..వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాల్లోనూ వైసీపీ గెలిచి తీరుతుందని అనిల్ ధీమా వ్యక్తం చేసారు.

చర్చకు సిద్దమా : టీడీపీ నేత నారా లోకేశ్ కు మాజీ మంత్రి అనిల్ సవాల్ చేసారు. లోకేష్ యువగళం పేరుతో చేస్తున్నది పాదయాత్ర కాదుని విహారయాత్రని ఎద్దేవా చేసారు. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఉదయం నుంచి రాత్రి వరకు చేసారని గుర్తు చేసారు. లోకేశ్ సాయంత్రం గంటలకు కాసేపు నడిచి యాత్ర అని చెబుతున్నారని విమర్శించారు. లోకేష్ మాట్లాడే ముందు భాష నేర్చుకోవాలని సూచించారు. నిజంగా దమ్ముంటే లోకేష్ జిల్లాలో అభివృద్ధి పై చర్చకు రావాలని అనిల్ సవాల్ చేసారు. సమయం..వేదిక లోకేశ్ డిసైడ్ చేయాలన్నారు. జిల్లాలో పెన్నాపై, సంగం, నెల్లూరు బ్యారేజీలు ఎవరు పూర్తి చేశారో తెలుసా అని ప్రశ్నించారు. నెల్లూరు సిటీలో చర్చిద్దామని..ముందుకు రావాలని లోకేష్ కి అనిల్ ఛాలెంజ్ చేసారు.

anilkumaryadavlokeshanam

ఆనం గెలవలేరు : ఆనం రామనారాయణ రెడ్డి పై అనిల్ సైటెర్లు వేసారు. ఆనం కుటుంభం పట్ల ఇంకా మంచిపేరు ఉందంటే అది విజయ్ కుమార్ రెడ్డి వల్లనే అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే అవకాశం ఇస్తే జగన్ ని విమర్శిస్తారా అంటూ నిలదీసారు. జిల్లాలో అభివృద్ధి పై ఆనం వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే పదవికి ఆనం రాజీనామా చేసి వెళ్ళాలని డిమాండ్ చేసారు. 2019 లో జగన్ అవకాశం ఇవ్వకుంటే ఆనం కు పునర్జీవం ఉండేది కాదని చెప్పుకొచ్చారు. రామనారాయణరెడ్డి తీరు వల్లే పలు అభివృద్ధి పనులు ఆగిపోయాయని వివరించారు. నెల్లూరు రూరల్.. సిటీలలో ఆనంకు బలం లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆనం గెలిచే ప్రసక్తే లేదని అనిల్ పేర్కొన్నారు.

నెల్లూరు నుంచే గెలుస్తా : ఎన్నికల్లో వైసీపీ గెలుస్తోందని..ఆయన మళ్లీ టిడిపిని వదిలేస్తారని చెప్పుకొచ్చారు. ఆనం ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదన్నారు. ఆనం ఓటమి తథ్యమని స్పష్టం చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా నెల్లూరు వచ్చి ఇచ్చిన హామీ ఏదీ అమలు కాలేదన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వైసిపిని వీడినంత మాత్రాన ఏమి కాదని..వైసిపిలో వాళ్ళు కలుపు మొక్కలుగా పేర్కొన్నారు. అందుకనే పీకి పారేశారని వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో ఈసారి పది సీట్లలో గెలుస్తామని అనిల్ ధీమా వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికల్లో. నెల్లూరు సిటీ నుంచి నేనే గెలుస్తానని అనిల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+