ఉద్యోగాలు పోతున్న మారడం లేదు.. విశాఖలో మరో పోలీస్ టిక్ టాక్
విశాఖపట్టణం : టిక్ టాక్ మాయలో పడి విధి నిర్వహణను కూడా మరచిపోతున్నారు. ఇటీవల విశాఖలో శక్తి టీం టిక్ టాక్‌లో మునిగితేలిన సంగతి మరవకముందే మరో ఘటన జరిగింది. ఓ కానిస్టేబుల్ పోలీసు స్టేషన్‌లో టిక్ టాక్ చేసి పోలీసు పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. అయితే అతను పోలీసు స్టేషన్‌లోనే టిక్ టాక్ చేయడం గమనార్హం. మరోవైపు ఈ ఘటనపై పోలీసు బాస్ సీరియస్‌గా ఉన్నారు. విచారణ ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని సంకేతాలిచ్చారు.
టిక్ టాక్ యాప్‌లో మునిగి ఉద్యోగాల మీదికి తెచ్చుకుంటున్నారు కొందరు. ఖమ్మం కార్పొరేషన్ ఉద్యోగులతో మొదలైన టిక్ టాక్ వ్యవహారం .. తాజాగా విశాఖ కానిస్టేబుల్ వరకు చేరింది. ఆయా ఘటనలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నా మిగతా వారిలో మార్పు రావడం లేదు. అధికారులు చర్యలు తీసుకుంటున్న భయం భక్తి లేకుండా ఉంటున్నారు. తాజాగా విశాఖలో కానిస్టేబుల్ టిక్ టాక్‌లో మునిగిపోయాడు. అరకులో కానిస్టేబుల్‌గా పనిచేసే సమయంలో నాగరాజు టిక్ టాక్ చేశాడు. పోలీసు స్టేషన్‌లో టిక్ టాక్ చేయడం కలకలం రేపింది. డైలాగు, పాటలకు ఎక్స్ ప్రేషన్ ఇస్తూ వీడియాల్లో మునిగిపోయాడు. మరోవైపు నడిరోడ్డుపై యూనిఫాంలో కూడా టిక్ టాక్ చేశాడు నాగరాజు. ఈ వీడియో వ్యవహరంపై ఎస్పీ సీరియస్‌గా ఉన్నారు. ఇప్పటికే శాఖపరమైన విచారణకు ఆదేశాలు జారీచేశారు.

విశాఖలో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన శక్తి టీం కూడా టిక్ టాక్ చేసింది. యూనిఫాంలో వారు టిక్ టాక్ చేశారు. ఆ తర్వాత నాగరాజు టిక్ టాక్ వెలుగులోకి వచ్చింది. అయితే నాగరాజు టిక్ టాక్ చేసింది అరకు పోలీసు స్టేషన్‌లో.. తర్వాత అతనికి ప్రమోషన్ వచ్చింది. అనకాపల్లికి హెడ్ కానిస్టేబుల్‌గా వచ్చాడు. ఇప్పుడు అనకాపల్లిలో విధులు నిర్వహిస్తుండటం విమర్శలకు దారితీసింది. ఏదీ ఏమైనా విధి నిర్వహణలో డ్యూటీలో ఉండాలే గానీ టిక్ టాక్‌లో మునిగితేలడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. కొందరికీ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటున్నా .. మిగతా అధికారుల్లో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications