Pawan Kalyan: పిఠాపురంలో పవన్ హవా.. మరో ఆసక్తికర ఫొటో వైరల్..!
ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఆసక్తిరేపిన నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఇక్కడి నుంచి పోటీకి దిగడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో పవన్ ను ఈసారి కూడా ఓడించేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేసింది. అయినా ఇక్కడి కాపులంతా ఏకమై పవన్ కు అండగా నిలబడ్డారనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో ఈసారి పవన్ గెలుపుకు ఢోకా లేదనే చర్చ జరుగుతోంది.
అదే సమయంలో వైసీపీ అభిమానులు, నేతలు కూడా వంగా గీత కనీస ఓట్లతో బయటపడతారనే ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆమెకు జగన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం హామీని స్టిక్కర్లుగా మార్చి కార్లపై వేయించుకుని తిరుగుతున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా దీనికి పోటీగా మరికొన్ని స్టిక్కర్లు వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఓ జనసేన అభిమాని తన బైక్ పై వేయించిన స్టిక్కర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సదరు జనసేన అభిమాని తన బైక్ పై నంబర్ ప్లేట్ స్ధానంలో పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ స్టిక్కర్ అతికించాడు. కింద జనసేన గుర్తులతో డిజైన్ కూడా పెట్టుకున్నాడు. తద్వారా పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అనుచరుడనే అర్ధం వచ్చేలా ఈ స్టిక్కరింగ్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల రాకముందే పిఠాపురంలో పవన్ గెలిచినట్లే అని భావిస్తున్న అభిమానులు ఇలా తమకు నచ్చిన మార్గాల్లో అభిమానం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ బైక్ స్టిక్కర్ ఫొటో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications